Monday, December 23, 2024

చెస్ గ్రాండ్ మాస్టర్ ప్రణీత్‌కు రూ. 2.5 కోట్లు ప్రకటించిన కెసిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రపంచ చెస్ ఫెడరేషన్ గ్రాండ్ మాస్టర్ టైటిల్‌ను అందుకున్న 16 ఏళ్ల ఉప్పల ప్రణీత్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సోమవారం రూ. 2.5 కోట్లు ప్రకటించారు. అతి చిన్న వయసులోనే చదరంగంలో ప్రణీత్ అంతర్జాతీయ ఖ్యాతిని పొందడం పట్ల ముఖ్యమంత్రి హర్షం వ్యక్తం చేశారు.

ప్రణీత్‌ను, అతని తల్లిదండ్రులను కెసిఆర్ సచివాలయానికి పిలిపించి, ప్రణీత్‌ను ఆశీర్వదించారు, అభినందించారు. ప్రణీత్ అభిరుచి, కృషి అతడిని గ్రాండ్ మాస్టర్‌ని చేశాయని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రణీత్ మరింత ఉన్నత శిఖరాలకు చేరుకుని తెలంగాణ రాష్ట్రానికి, భారత దేశానికి కూడా వన్నె తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రణీత్‌కు శిక్షణ, ఇతర ఖర్చుల నిమిత్తం రూ. 2.5 కోట్లను ముఖ్యమంత్రి ప్రకటించారు.

వీరపల్లి నందిత(19)ను ప్రపంచ చెస్ సమాఖ్య ‘ఉమెన్ క్యాండిడేట్ మాస్టర్’గా గుర్తించినందుకు కెసిఆర్ అభినందించారు. ఆమెకు అధునాతన శిక్షణ, ఇతర ఖర్చులకుగాను రూ. 50 లక్షలు ప్రకటించారు. నందిత అంతర్జాతీయ స్థాయిలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News