భారీ తారాగణం ఉన్న అన్నీ మంచి శకునములే సినిమాకు సంగీతం సమకూర్చడం ఓ ఛాలెంజ్ : మిక్కీ జె మేయర్
నేను సెలెక్టివ్ గా చిత్రాలు చేయడం లేదు. పీపుల్ నన్ను అలా కోరుకుంటున్నారు : మిక్కీ జె మేయర్
ప్రముఖ నిర్మాణ సంస్థ స్వప్న సినిమా నిర్మాణంలో ప్రతిభ గల దర్శకురాలు నందిని రెడ్డి దర్శకత్వంలో సంతోష్ శోభన్, మాళవిక నాయర్ ప్రధాన పాత్రలలో రూపొందిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ‘అన్నీ మంచి శకునములే’. మిత్ర విందా మూవీస్ తో కలిసి ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో పాటు పాటలు కూడా సినిమా పై అంచనాలని పెంచాయి. మే 18 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అన్నీ మంచి శకునములే చిత్రానికి మిక్కీ జె మేయర్ సంగీతం సమకూర్చారు. అటు మాస్, ఇటు క్లాస్ సినిమాలకు బాణీలు సమకూర్చే మిక్కీ జె మేయర్ అన్నీ మంచి శకునములే చిత్రం గురించి, ఇతర విషయాల గురించి ఇంటర్వ్యూ లో తెలియజేసారు.
నందిని రెడ్డిగారు కథ చెప్పినప్పుడు మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఏమి షేర్ చేసుకున్నారు?
నందిని రెడ్డి గారు కథ చెప్పినప్పుడు మ్యూజిక్ ఎలా ఇవ్వాలనేది అర్తమైంది. విక్టోరియా పురం అనే ఊరి కథ కాట్టి ఊరికి తగినవిధంగా మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ వుండాలి. అదో కొత్త ప్రపంచం. ఎందుకంటే లిటిల్ బిట్ ఆప్ బ్రిటీష్ టైప్ లో వుంటుంది. వాటికి ట్యూన్ మ్యాచ్ అయ్యేవిధంగా చూసుకున్నాను. పాటలు డిఫరెంట్ గా పీస్‌ఫుల్ గా వుంటాయి.
మూవీ బాగుంటే సంగీతదర్శకులు పెద్దగా స్ట్రగుల్ పడాల్సిన అవసరంలేదుగా?
జనరల్ గా ఏ సినిమాకైనా వందశాతం ఎఫర్ట్ పెడతాం. ఒకవేళ సినిమా బాగోకపోతే ప్రతీదీ స్పాయిల్ అవుతుంది. బాగోకపోతే ప్రతీ దానికీ విమర్శలు ఎదురవుతాయి. స్క్రీప్ట్, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం బాగుంటే మా జాబ్ సక్సెస్ అవుతుంది.
మీకు కథ చెప్పినప్పుడే జడ్జిమెంట్ వస్తుందికదా. మీరు వారితో ఏమైనా షేర్ చేసుకున్నారా?
సహజంగా కథ చెప్పేటప్పుడే కొంత జడ్జిమెంట్ వస్తుంది. ఏమి ఇవ్వాలి. ఎంత మోతాదులో పనిచేయాలనేది తెలుస్తుంది. ఆ తర్వాత బ్యాక్ గ్రౌండ్ చేసి అంతా రెడీ అయ్యాక సినిమా చూసుకున్నప్పుడు ఏవైనా మార్పులు అనిపిస్తే వారితో షేర్ చేసుకుంటాం.
మహానటి తర్వాత వైజయంతి మూవీస్ లో పనిచేయడం, ఈ నిర్మాతలతో మీకున్న అనుబంధం ఎలా వుంది?
స్వప్న, ప్రియాంక అశ్వనీదత్ గారు, నాగ్ అశ్విన్ తో పనిచేయడం ఒకరకంగా కష్టమైన జాబ్ (నవ్వుతూ) అయినా కంపోజర్స్ ఆలోచనలు వారు గౌరవిస్తారు. నా అభిప్రాయాలకు ఫ్రీడమ్ ఇస్తారు. మహానటి తర్వాత అన్నీ మంచి శకునములే లాంటి మంచి ప్రాజెక్ట్ వచ్చింది నాకు. ఇది రెండేళ్ళనాడే మొదలైంది. స్వప్నగారు రెగ్యులర్ ఛాటింగ్ లో మూవీ గురించి అభిప్రాయాలు చెబుతుంటారు. నేను వారికి షేర్ చేస్తుంటాను.
ఇందులో 6 పాటలున్నాయి కదా ఏ పాట మిమ్మల్ని ఇబ్బంది పెట్టింది?
పాండమిక్ కు ముందే వీటి గురించి పనిచేశాం. ఒక పాట చేశాక ఆరునెలలు గ్యాప్ వచ్చింది. ఆ తర్వాత కాలానుగుణంగా అది బోర్ అవుతుందేమోనని ఫీలింగ్ కలిగింది. అందుకే అప్పటినుంచి ప్రతి ట్యూన్ కోసం స్ట్రగుల్ పడ్డాం. కొత్త కొత్త ఆలోచనలతో తగినట్లుగా పనిచేశాం.
మీరు విదేశాల్లో ఎక్కువగా ఉంటారు. ఆ ప్రభావం పనిమీద చూపిస్తుందా? లోకల్ గా వుంటే నేరుగా వారితో చర్చించే అవకాశం వుంటుంది కదా?
ఇప్పటివరకు అలాంటి ఫిర్యాదులు లేవు. నా వర్కింగ్ స్టయిల్ హ్యాపీడేస్ లోనే కనిపిస్తుంది. నేను ఏ సినిమాకూ మ్యూజిక్ సిట్టింగ్ లో పాల్గొనలేదు. కేవలం ఫోన్ లోనే మాట్లాడుతుండేవాడిని. నేను కంపోజ్ చేసినవి దర్శకుడికి వినిపించేవాడిని. నా మ్యూజీషియన్ టీమ్ కూడా ఎక్కువగా లండన్, అమెరికాలలో వుంటుంటారు. వారికి నేను కాంటాక్ట్ లోనే వుంటాను. అందుకే నేను విదేశాల్లో వుండాల్సివస్తుందనుకుంటున్నా. ఇప్పటివరకు అలాగే చేస్తున్నాను.
మీరు సెలెక్టివ్ గా సినిమాలు చేస్తుంటారా? మీ పని విధానం ఎలా ఉండాలనుకుంటారు?
ప్రారంభంలో కొంతకాలం అంటే 10 సంవత్సరాలు అలా చేశాను. అప్పట్లో ఏడాదికి 4,5 సినిమాలే చేసేవాడిని. ఫ్యామిలీ పిల్లల బాధ్యత ఉండేది. నాకు పెద్దగా ఫ్రెండ్స్ కూడా లేరు. అందుకే ప్రస్తుత పరిస్థితులను బట్టి గత రెండేళ్ల నుంచి ఎక్కువ సినిమాలు చేయాలనుకుంటున్నాను. గ్రో అయ్యే కొద్దీ డిఫరెంట్ మూవీస్ చేయాలనుకుంటా. ఒకరకంగా చెప్పాలంటే, నేను సినిమాలను ఎంపిక చేసుకోవడం లేదు. పీపుల్ నన్ను అలా కోరుకుంటున్నారు.
మిక్కీగారంటే సెన్సిటివ్ కథలే చేయాలనుకుంటారా? మరి మాస్ సినిమాలు తగ్గించారా?
నాకు మెలోడీ అంటేనే ఇష్టం. వాటినే ఎంజాయ్ చేస్తాను. మిగతావి కొంచెం కష్టమైనవిగా అనిపిస్తాయి. మాస్ మూవీస్ గద్దల కొండ గణేష్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ వంటి సినిమాల్లో నా బెస్ట్ ఇచ్చాను. కానీ మెలోడీ నేను ఎంజాయ్ చేస్తాను. నేను మూడుగంటలుపాటు ట్రావెల్ చేయాల్సివస్తే కొత్తబంగారులోకం, హ్యాపీడేస్ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తాను. దీనికి ప్రత్యేకమైన కారణం ఏమీ లేదు. అందుకే మెలోడీ ఎక్కువగా చేస్తుంటా. ఒకరకంగా చెప్పాలంటే మెలోడీ అనేది లాంగ్ టర్మ్ వుంటుంది. మాస్ కొద్దికాలం వరకు వుంటుంది.
వెబ్ సిరీస్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా?
ఇప్పుడు నేను సినిమాలతో బిజీగా వున్నాను. వెబ్ సిరీస్ గురించి దర్శకులు అడిగితే చేస్తాను. కానీ సినిమాలే మోర్ ఛాలెంజింగ్ గా వుంటాయి.
అన్నీ మంచి శకునములే మీకు ఎంత స్పెషల్ అని చెప్పగలరు?
ఈ సినిమాను 2020 లో మొదలు పెట్టాం. టైటిల్ సాంగ్ అక్టోబర్ 2020లో ప్రారంభించాను. అప్పటినుంచీ ఈ సినిమాపై పనిచేస్తూనే వున్నాను. ఒకరకంగా టైర్డ్ అయినట్లు అనిపిస్తుంది. ఫైనల్ గా థియేటర్ కు వచ్చేసింది. ఈ సినిమాకు బ్యాక్‌గ్రౌండ్ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే ఇందులో చాలామంది సీనియర్స్ నటించారు. వారందిరికీ తగినవిధంగా మ్యూజిక్ ఇవ్వడం ఈ సినిమాలోని ప్రత్యేకత.
కొత్త సినిమాలు గురించి?
వరుణ్‌తేజ్ తో ప్రవీణ్ సత్తారు సినిమా ఒకటి. బాలీవుడ్ దర్శకుడు శక్తితో చేయబోతున్నా అందులోనూ వరుణ్‌తేజ్ హీరోనే. ఆ తర్వాత శ్రీకాంత్ అడ్డాల గారితో చేయబోతున్నా. దిల్‌రాజు సెల్ఫిష్ మూవీ రన్నింగ్ లో వుంది. స్వప్ప సినిమా పై ఛాంపియన్ సినిమా చేయబోతున్నా. ఇంకొకటి ఓ చిన్న సినిమా అమెరికన్ డైరెక్టర్ తో చేయబోతున్నా.
మీ సినిమాలన్నీ డిఫరెంట్ నేపథ్యాలతో వుంటున్నాయే?
అవును. ఎయిర్‌ఫోర్స్ నేపథ్యం ఒకటి చేస్తున్నా. అయితే, నేను చేసిన రామబాణం కూడా మంచి సినిమానే. దాన్ని నేను ఎంజాయ్ చేశాను. సక్సెస్ ఫెయిల్యూర్ పక్కనపెడితే డిఫరెంట్ డైరెక్టర్ తో పనిచేశాననే సంతృప్తి వుంది. అలా నేను చేసిన శేఖర్ కమ్ముల, హరీష్ శంకర్, నాగ్ అశ్విన్, నందినీరెడ్డి వీరంతా క్లాస్ మాస్ వున్న వైవిధ్యమైన స్టయిల్ వున్న దర్శకులే. వారితో పని చేయడం వల్ల నేనూ అంతో ఇంతో నేర్చుకుంటూనే ఉంటాను. అని ముగించారు.