Friday, January 3, 2025

ఎఎస్‌ఐ చేత జ్ఞానవాపి మసీదు సర్వే

- Advertisement -
- Advertisement -

పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన వారణాసి కోర్టు

వారణాసి: వారణాసిలోని కాశీ విశ్వేశ్వర ఆలయానికి పక్కన ఉన్న జ్ఞానవాపి మసీదు ఆవరణ మొత్తాన్ని భారత పురాతత్వ పరిశోధనా విభాగం(ఎఎస్‌ఐ) చేత సర్వే చేయించాలని కోరుతూ దాఖలయినపిటిషన్‌ను విచారించడానికి స్థానిక కోర్టు మంగళవారం అంగీకరించింది. హిందువులకు ప్రాతినిధ్యం వహిస్తున్న లాయరు విష్ణు శంకర్ జైన్ దాఖలు చేసిన ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన జిల్లా కోర్టు జడ్జి ఎకె విశ్వేశ్ ఈ పిటిషన్‌పై ఈ నెల 19లోగా తన సమాధానాన్ని దాఖలు చేయాలని జ్ఞానవాపి మసీదు కమిటీని ఆదేశించినట్లు జిల్లా ప్రభుత్వ తరఫు న్యాయవాది మహేంద్రనాథ్ పాండే తెలియజేశారు.

కేసు తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. జ్ఞానవాపి మసీదులో శివలింగంగా చెప్పబడుతున్న ఆకృతి వయసును ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిర్ధారించాల్సిందిగా గత శుక్రవారం అలహాబాద్ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. కోర్టు ఆదేశాల మేరకు జ్ఞానవాపి మసీదులో జరిపిన సర్వే సందర్భంగా 2022 మేలో బయల్పడిన ఈ శివలింగం ఆకృతిపై కార్బన్ డేటింగ్ సహా శాస్త్రీయ దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలయిన పిటిషన్‌ను కొట్టివేస్తూ వారణాసి జిల్లా కోర్టు గత ఏడాది అక్టోబర్ 14న ఇచ్చిన తీర్పును హైకోర్టు తోసిపుచ్చింది. శివలింగంపై శాస్త్రీయ అధ్యయనం నిర్వహించాలన్న హిందూ భక్తుల దరఖాస్తుపై చట్టప్రకారం ముందుకు వెళ్లాలని వారణాసి జిల్లా కోర్టును హైకోర్టు ఆదేశించింది. దీంతో శివలింగం ఆకృతి వయసును నిర్ధారించడానికి మార్గం సుగమం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News