Monday, December 23, 2024

‘ట్రాన్స్‌జెండర్’ పట్ల వివక్ష అమానవీయం!

- Advertisement -
- Advertisement -

‘ఇంటర్నేషనల్ లెస్బియన్ అండ్ గే అసోసియేషన్ (ఐయల్‌జిఎ)’తో పాటు ‘ఇంటర్నేషనల్ గే అండ్ లెస్బియన్ హ్యూమన్ రైట్స్ కమీషన్’ సంయుక్తంగా 17 మే 2005న ప్రారంభించిన ‘అంతర్జాతీయ హోమోఫోబియా వ్యతిరేక దినం’ సందర్భంగా ట్రాన్స్‌జెండర్ (లింగ మార్పిడి) వర్గం ఎదుర్కొంటున్న వివక్ష, చిన్న చూపు, నిరాదరణ, ఎగతాళికి గురికావడం, పరుష మాటలను ప్రయోగించడం, భౌతిక దాడులు చేయడం, హింసాత్మక పోకడలకు వ్యతిరేకంగా లోతైన అవగాహన కల్పించుట జరుగుతోంది.

17 మే 1990 న ఐరాస, డబ్ల్యుహెచ్‌ఒ నిర్ణయం ప్రకారం హోమో సెక్సువాలిటీ (స్వలింగ సంపర్కం) అనేది మానసిక రుగ్మత కాదని తీర్మానించడానికి గుర్తుగా 17 మే రోజును ఈ దినం పాటించుట జరుగుతున్నది. ఫ్రాన్స్ లాంటి దేశాలు ఏక-లింగ లైంగిక సంపర్క వ్యక్తుల (సేమ్ సెక్స్) మధ్య వివాహాలను కూడా అనుమతించడం జరిగింది. హోమో ఫోబియా, బయో ఫోబి యా, ట్రాన్స్ ఫోబియా వర్గ ప్రజల సమస్యల్ని అర్థం చేసుకొని వారి మానవ హక్కులకు విఘాతం కలుగకుండా తగు చర్యలు తీసుకోవాలనే సందేశాన్ని ఈ వేదిక కల్పిస్తున్నది. లెస్బియన్, గే, బయో సెక్సువల్, ట్రాన్స్‌జెండర్లు (యల్‌జిబిటి) స్వతంత్రంగా, స్వేచ్ఛ గా జీవించలేకపోతున్నారని, వీరిని నేరస్థులుగా చూసే దేశాలు కూడా ఉన్నాయి.

సమాజానికి దూరంగా యల్‌జిబిటి వర్గాలు
యల్‌జిబిటి వర్గ ప్రజలు సభ్య సమాజానికి దూరం గా, పలు మానసిక సమస్యలతో సతమతమవుతూ, అనునిత్యం భయం భయంగా బతుకుతున్నారని, దీనినే హోమో ఫోబియా అంటారని తెలుసుకోవాలి. లెస్బి ఫోబియా, గే పోబియీ, బయో ఫోబియా, ట్రాన్స్ ఫోబియా లాంటివి అన్నీ హోమో ఫోబియా పరిధిలోకి వస్తాయని అర్థం చేసుకోవాలి. యల్‌జిబిటి వర్గానికి చెందిన ప్రజల్ని ఆదరించడం, పరుషంగా మాట్లాడకపోవడం, సున్నితంగా ప్రవర్తించడం, సాధారణ జనజీవన స్రవంతిలో కలుపుకోవడం, వారి హక్కుల్ని కాపాడటం, వారితో స్నేహితుల్లా మెలగడం, వారికి అన్ని వసతులు కల్పించడం, సాధారణ మనుషులుగా చూడడం, సంఘీభావాన్ని తెలియచేయడం లాంటి కార్యక్రమాలను చేపట్టాలి. అంతర్జాతీయ హోమో ఫోబియా వ్యతిరేక దినం – 2023 నినాదంగా ‘టు గెదర్ అల్ వేస్: యునైటెడ్ ఇన్ డైవర్సిటీ’ అనే అంశాన్ని తీసుకున్నారు. హోమో ఫోబియాకు లోనైన ప్రజల్లో మానసిక ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి కూడా రావచ్చని మనందరం గమనించి వారి హక్కులను గౌరవించాలి.

ఇండియాలో థర్డ్ జెండర్ భావన అధికం
ఇండియాలో 2.5 మిలియన్ల యల్‌జిబిటి వర్గ ప్రజలు ఉన్నారని, అనేకులు బయటకు చెప్పడానికి భయపడుతూ, హోమో ఫోబియాకు లోనవుతున్నారని తెలుస్తున్నది. భారత సమాజంలో ‘థర్డ్ జెండర్’ భావన విస్తృతంగా వినియోగించుట జరుగుతుంది. 2017 లో సుప్రీమ్‌కోర్టు యల్‌జిబిటి వర్గాన్ని గుర్తించడం, 2018లో ‘గే సెక్స్’ను చట్టబద్ధం చేయడం, స్వతంత్ర భావనలను వ్యక్తం చేయడానికి అనుమతిని ఇచ్చింది. భారత యల్‌జిబిటి వర్గం మానసిక, భౌతిక, భావోద్వేగ, ఆర్థిక వివక్షకు గురికావడమే కాకుండా కుటుంబ ఆదరణ, పోలీసుల రక్షణ కూడా కోల్పోవడం విచారకరం.

కౌమార దశలోని యువతకు నిర్వహిస్తున్న ‘సాథియా’ విద్యా పథకంలో భాగంగా స్వలిం గ సంపర్కం గూర్చి కూడా బోధించడం జరుగుతోంది. యల్‌జిబిటి సమూహాలు హింస, నిరుద్యోగం, వివక్ష, కుటుంబం వెలివేయడం, పాఠశాలల్లో వేధింపులు, సమాజ చిన్నచూపు లాంటి అసంఖ్యాక సమస్యలతో హోమో ఫోబియాకు గురికావడం అనాదిగా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో యల్‌జిబిటి జనులు నిరక్షరాస్యత, పేదరికం, మానసిక, శారీరక అనారో గ్యం, శ్రమ దోపిడీ, హక్కుల తరిగిపోవడం, హింసాత్మక దాడులు పెరగడం లాంటి సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. హోమో ఫోబియా ఉచ్చులో చిక్కి మనిషిలా గుర్తించబడని దుస్థితిలో దుర్భర బతుకులు ఈడ్చుతున్న యల్‌జిబిటి వర్గాల ప్రజలను చులకనగా చూడకుండా సాటి మనుషులుగా ఆదరిస్తూ మానవత్వాన్ని ప్రదర్శిద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News