- Advertisement -
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఈస్ట్ మిడ్నాపూర్ జిల్లాలో ఓ బాణాసంచా ఫ్యాక్టరీలో పేలుళ్లు సంభవించాయి. ఈగ్రా ప్రాంతంలో పేలుళ్లు జరగడంతో తొమ్మిది మృతి చెందారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్రమం బాణసంచా ఫ్యాక్టరీ నిర్వహిస్తుండడంతో ఆ ఫ్యాక్టరీ యజమాని గతంలో అరెస్టు చేశామని సిఐడి విభాగం తెలిపింది. జైలు నుంచి విడుదలైన తరువాత అదే ఫ్యాక్టరీని నిర్వహిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. మృతుల కుటుంబాలకు రూ.2.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తెలిపారు. ఒడిశా సరిహద్దులో ఫ్యాక్టరీ ఉండడంతో సరైన నిఘా లేదని స్థానికులు వాపోతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. యజమాని మాత్రం ప్రస్తుతం పరారీలో ఉన్నాడు.
Also Read: రోడ్డు ప్రమాదంలో లేడీ సింగం మృతి
- Advertisement -