Monday, December 23, 2024

జగన్‌తో ‘పాపం పసివాడు’ సినిమా తీస్తే బాగుంటుంది: పవన్

- Advertisement -
- Advertisement -

అమరావతి: సిఎం జగన్ మోహన్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా పవన్ కల్యాణ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వర్గ యుద్ధం అనే పదాన్ని ఉచ్ఛరించే హక్కు కూడా వైసిపి వాళ్లకు లేదని దుయ్యబట్టారు. వైసిపోళ్లు పుచ్చలపల్లి సుందరయ్య, తరిమెల నాగిరెడ్డిలు కాదన్నారు. అక్రమ సంపాదన, హింసతో జగన్ రెచ్చిపోతున్నారని, ఏదో ఒక రోజు రాయలసీమ జగన్ నుంచి విముక్తి పొందుతుందని ఘాటుగా విమర్శించారు. ఎవరైనా జగన్‌తో పాపం పసివాడు సినిమా తీస్తే బాగుంటుందని పవన్ చురకలంటించారు. పాపం పసివాడు సినిమా తీయాలంటే ఇసుక ఏడారులు రాజస్థాన్ కావాలని, ఆంధ్రప్రదేశ్‌లో నది ఒడ్డున ఇసుకను వైసిపి దోచుకుందని పవన్ మండిపడ్డారు. కలెక్షన్ పాయింట్లలో తగినంత ఇసుక దిబ్బలు ఉన్నాయని విమర్శించారు. మనీ లాండరింగ్ తో ఉన్న సూట్ కేసులను జగన్ కావాలన్నారు.

Also Read: ఎపిలో రోడ్డు ప్రమాదం… ఐదుగురు నల్లగొండ వాసులు మృతి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News