Friday, December 20, 2024

ఆటో రిక్షా వివాదం…. పెట్రోల్ పోసి తగలబెట్టడంతో మేనకోడలు మృతి…

- Advertisement -
- Advertisement -

లక్నో: ఆటో రిక్షా విషయంలో వివాదం తలెత్తడంతో పెట్రోల్ పోసి తగలబెట్టడంతో మేన కోడలు మృతి చెందిన సంఘటన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం కాన్పూర్‌లో జరిగింది. మరో ఇద్దరు కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…. కాన్పూర్‌లోని కంట్ ప్రాంతంలో రామ్‌కుమార్ అనే వ్యక్తి తన భార్య స్వప్న కలిసి ఉంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం రామ్ కుమార్ బాబాయ్ రామ్ నారాయణ ఆ కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. రామ్ నారాయణ, రామ్ కుమార్ కలిసి ఆటోను తీసుకొని నడిపిస్తున్నారు. గత కొంత కాలంగా ఇద్దరు మధ్య ఆటో విషయంలో గొడవలు జరుగుతున్నాయి.

Also Read: నల్లగొండ… నిప్పుల కొండ

రామ్ కుమార్ తన భార్య స్వప్న, సోదరి మోనిక, పక్కింటి ఆమె రాజకుమారితో కలిసి వెళ్తుండగా వారిపై రామ్ నారాయణ పెట్రోల్ పోసి తగలబెట్టాడు. వెంటనే వారిని స్థానిక ఉర్సాలా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ స్వప్న చనిపోయింది. రామ్ నారాయణ టెర్రస్ పైనుంచి తమపై పెట్రోల్ పోసి తగలబెట్టాడని మోనికా తెలిపింది. మోనికా, రాజకుమారి పరిస్థితి కూడా విషమంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. జాయింట్ కమిషనర్ ఆనంద్ ప్రకాశ్ తివారి తన సిబ్బందితో కలిసి ఆస్పత్రికి చేరుకొని బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News