Monday, December 23, 2024

ఖరీఫ్ ఎరువుల సబ్సిడీ కి కేబినెట్ ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ఖరీఫ్‌లో ఎరువుల సబ్సిడీకి కేంద్రం రూ 1.08 లక్షల కోట్లు ఖర్చుపెడుతుంది. ఈ మేరకు తీసుకున్న నిర్ణయానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిందని ఎరువుల మంత్రి మన్‌సుఖ్ మాండవీయ బుధవారం తెలిపారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన మంత్రి మండలి సమావేశం జరిగింది. 202324 ఖరీఫ్ పంటకాలానికి కూడా ఇప్పుడున్న ధరలకే రైతులకు ఎరువులు అందేలా చేసేందుకు సబ్సిడీని కల్పించేందుకు అయ్యే వ్యయం వివరాలను మంత్రి విలేకరులకు అందించారు. ఎప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకూ ఖరీఫ్ సీజను ఉంటుంది.

ఈ పంటకాలంలో ఫాస్పేట్ పొటాసియం ఎరువులకు రూ 38000 కోట్ల సబ్సిడీ అందుతుంది, యూరియాకు రూ 70,000 కోట్ల సబ్సిడీ కలిపితే మొత్తం మీద సబ్సిడీ విలువ రూ లక్షకోట్లు దాటుతోంది. ఎరువుల గరిష్ట ధరలలో ఎటువంటి మార్పులు ఉండబోవని మంత్రి తెలిపారు. ఇప్పుడు దేశంలో యూరియా బస్తా ధర రూ 276గా ఉంది. కాగా డిఎపి ఎరువు బ్యాగ్ ధర రూ 1,350గా ఉంది. సబ్సిడీతో దేశ వ్యాప్తంగా దాదాపుగా 12 కోట్ల మంది రైతులకు మేలు జరుగుతుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News