Monday, December 23, 2024

పోలీసులు చుట్టుముట్టారు.. ఇక అరెస్టు తప్పదు: ఇమ్రాన్

- Advertisement -
- Advertisement -

లాహోర్: పోలీసులు, సైన్యం తన నివాసాన్ని చుట్టుముట్టారని, తాను ఏ క్షణంలో అయినా అరెస్టు కావచ్చునని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ బుధవారం చెప్పారు. దీనిని అరెస్టు అంటారా? దమనకాండ అంటారా ప్రజలే నిర్ణయించాలన్నారు. తాను ఇక అరెస్టు కానున్నానని, దీనికి ముందు మాట్లాడుతున్న మాటలు ఇవేనేమోనని పేర్కొంటూ వీడియో సందేశం ద్వారా ఆయన ట్వీటు వెలువరించారు.

అరెస్టుకు తాను భయపడటం లేదని, అయితే పాకిస్థాన్ ఎటువంటి విధ్వంసకర పరిస్థితిని ఎదుర్కొవల్సి వస్తుందో అనేదే తన భయం అన్నారు. మన దేశ చీలికలు పేలికలను తిరిగి సేకరించుకోలేని దశకు చేరుకుంటామనే ఆందోళన ఉందని తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News