Saturday, November 23, 2024

అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా 2022–23 వార్షిక ఫిర్యాదుల నివేదిక

- Advertisement -
- Advertisement -

అడ్వర్టైజింగ్ స్టాండర్డ్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ASCI) 2022-23కి సంబంధించి వార్షిక ఫిర్యాదుల నివేదికను విడుదల చేసింది. ఇందులో అనేక ఆశ్చర్యకరమైన పరిశీలనలు ఉన్నాయి, ము ఖ్యంగా డిజిటల్ స్పేస్‌లో ప్రకటనలకు సంబంధించినవి. ఈ ఏడాది కాలంలో, ప్రింట్, డిజిటల్, టెలివిజన్‌తో సహా వివిధ మాధ్యమాలలో 7,928 ప్రకటనలను ASCI సమీక్షించింది. ASCI గత 2 సంవత్సరాలలో ప్రకట నల పరిశీలనను దాదాపు 2 రెట్లు పెంచింది. టీవీ, ప్రింట్ ప్రకటనకర్తలు 94% మేరకు అత్యంతగా నిబంధనల పా టింపు కొనసాగించారు, అయితే డిజిటల్ ను కూడా కలిపితే, మొత్తం మార్గదర్శకాల పాటింపు అనేది 81% గా ఉంది. అందువల్ల, డిజిటల్ ప్రకటనలు కేవలం ఉల్లంఘనల్లో అగ్రగామిగా ఉండడం మాత్రమే కాకుండా, నిబంధ నలను అతి తక్కువగా పాటించేవిగా కూడా ఉంటున్నాయి. ప్రాసెస్ చేయబడిన వాటిలో 75% ప్రకటనలు డి జిటల్ స్పేస్ నుండే వచ్చాయి. ఇది ఆన్‌లైన్ స్పేస్‌లో వినియోగదారుల భద్రత గురించి ఆందోళనలను అధి కం చేసేదిగా మారింది.

నివేదిక ప్రకారం, రియల్-మనీ గేమింగ్ పరిశ్రమ అనేది విద్యా రంగాన్ని అధిగమించి మార్గదర్శకాలను అత్యం త ఉల్లంఘించే రంగంగా ఉద్భవించింది, ఐదవ స్థానం నుండి మొదటి స్థానానికి చేరుకుంది. 2022–23 సంవ త్సరానికి ASCI సమీక్షించిన వాటిలో అత్యధికం (92%) గేమింగ్ ప్రకటనలే. రియల్‌మనీ గేమింగ్ ప్రకటనలు మార్గదర్శకాలను పాటించలేదు. ఆర్థిక నష్టం, వ్యసనం వల్ల కలిగే నష్టాల గురించి వినియోగదారులకు తెలియజేయడంలో విఫలమయ్యాయి. ఈ రంగం మార్గదర్శకాలను అతి తక్కువగా పాటించి, విశ్వసనీయం కాదేమో అనే అనుమానాలను రేకెత్తించింది. వచ్చిన అభ్యంతరాలను తెలియజేసిన పిమ్మట, కేవలం 50% ప్రకటనలు మాత్రమే స్వచ్ఛందంగా సవరించబడ్డాయి. రియల్-మనీ గేమింగ్ సెక్టార్ కోసం ASCI తన మార్గ దర్శకాలను 2020 డిసెంబర్‌లోనే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత సమాచార, ప్రసార మంత్రి త్వ శాఖ కూడా అందరూ ఈ మార్గదర్శకాలను పాటించాలని కోరుతూ ఒక సలహాను జారీ చేసిందని గుర్తుం చుకోవాలి. సెలబ్రిటీలను చూపిస్తూ తప్పుదోవ పట్టించే ప్రకటనల సంఖ్య గణనీయంగా పెరిగిందని నివేదిక వెల్లడించింది. ASCI అటువంటి 503 ప్రకటనలను ప్రాసెస్ చేసింది.

మునుపటి సంవత్సరంలో ఇలాంటివి 55గా ఉండినవి. అంటే వీటిలో 803% వృద్ధి. ఈ యాడ్స్‌ లో 97% వాటిలో, కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ద్వారా నిర్దేశించిన తగిన శ్రద్ధకు సంబంధించిన సాక్ష్యాలను అందించడంలో సెలబ్రిటీలు విఫలమయ్యారు. సెలబ్రిటీల ప్రకటనలు వినియోగదారులపై అధిక ప్రభావాన్ని చూపుతాయి కాబట్టి ఇది ఒక తీవ్రమైన సమస్యగా మారింది. అదనంగా, ఇన్‌ఫ్లుయెన్సర్ ఉల్లంఘనలు 26%గా ఉన్నాయి, వాటిపై 2,039 ఫిర్యాదులు ప్రాసెస్ చేయబడ్డాయి. వ్యక్తిగత సంరక్షణ, ఆహారం, పానీయాలు, ఫ్యాషన్, జీవనశైలితో సహా వివిధ కేటగిరీలు ఇన్‌ఫ్లుయెన్సర్-సంబంధిత ఉల్లంఘనల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాయి.

ప్రకటనలు కుప్పలుతెప్పలుగా రావడం, ప్రాసెస్ చేయవలసిన ప్రకటనల అధికం కావడం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ASCI ఆర్టిఫిషియల్-ఇంటెలిజెన్స్-ఆధారిత ట్రాకింగ్‌ను స్వీకరించడం అది డిజిటల్ మీడియాను సమర్థవంతంగా పరిశీలించే సామర్థ్యాన్ని బలపరిచింది. ఈ స్వీయ-నియంత్రణ సంస్థ బాధ్యతాయుతమైన ప్రక టనల పద్ధతులను ప్రోత్సహించడానికి, వినియోగదారుల హక్కులను రక్షించడానికి తన నిబద్ధతలో సుస్థిరం గా ఉందని ఇది చూపిస్తుంది. ASCI వార్షిక ఫిర్యాదుల నివేదిక అనేది ప్రకటనకర్తలు, ప్లాట్‌ఫామ్‌లు, రెగ్యులేటర్‌లకు మేల్కొలుపు పిలుపుగా పని చేస్తుంది, సురక్షితమైన వాతావరణాన్ని సృష్టించి వినియోగదారుల మధ్య నమ్మకాన్ని పెంపొందించాల్సిం దిగా వారిని ప్రోత్సహిస్తుంది.

ASCI చైర్మన్ NS రాజన్ ఇలా అన్నారు: “డిజిటల్ అడ్వర్టైజింగ్ ల్యాండ్‌స్కేప్ నిజంగా మనందరికీ సవాలు విసురుతోంది. ASCI కూడా దీనికి మినహాయింపు కాదు. AI ఆధారిత సాధనాలు, బలమైన ఫిర్యాదు నిర్వహణ వ్యవస్థ ద్వారా మా నిఘాను పెంచడం వలన ASCI ఈ డైనమిక్ వాతావరణంలో వేగాన్ని కలిగి ఉంది. కొత్తగా వస్తున్న వినియోగదారు ఆందోళనలను ప్రతిబింబించేలా మా మార్గదర్శకాలను అప్‌డేట్ చేయడం వల్ల ASCI మార్గదర్శకాలు సమకాలీనంగా ఉండేలా చూస్తుంది. మేం పారదర్శకతతో, భవిష్యత్తును ఎదుర్కొనే నైపుణ్యంతో భారతీయ ప్రకటన పరిశ్రమకు మనస్సాక్షి గా వ్యవహరిస్తాం. ”

ASCI సీఈఓ, సెక్రటరీ జనరల్ మనీషా కపూర్ ఇలా అన్నారు: “మార్గదర్శకాలను ఉల్లంఘించే ప్రకటనల విషయంలో డిజిటల్ మాధ్యమం ముందుందని 2022–23కి సంబంధించిన ఫిర్యాదుల విశ్లేషణ స్పష్టంగా చూపి స్తుంది. ఇది ఆన్‌లైన్ వినియోగదారు భద్రత, విశ్వాసం గురించి ముఖ్యమైన ఆందోళనలను లేవనెత్తుతుంది. వినియోగదారు ప్రయోజనాలను కాపాడేందుకు ఈ సమస్యను అత్యవసర ప్రాతిపదికన పరిష్కరించడానికి ప్రక టనకర్తలు, కంటెంట్ సృష్టికర్తలు, ప్లాట్‌ఫామ్‌లు కలిసి రావాలి. అంతేగాకుండా, మార్గదర్శకాలను ఉల్లంఘించే గేమింగ్ ప్రకటనల సంఖ్య గణనీయంగా పెరగడాన్ని కూడా పరిశ్రమ తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉంది.’’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News