Saturday, December 21, 2024

ఎన్టీఆర్ విగ్రహావిష్కరణపై హైకోర్టు

- Advertisement -
- Advertisement -

ఖమ్మం : ఖమ్మంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. ఖమ్మంలో కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ హైకోర్టులో 14 రిట్ పిటిషన్‌లు దాఖలయ్యాయి. శ్రీ కృష్ణ జేఏసీ, అదిభట్ల కళాపీఠం, భారతీయ యాదవ సంఘం పిటిషన్లు దాఖలు చేశాయి. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన హైకోర్టు వారి వాదనలను విన్నది. పిటిషనర్ల వాదనలను విన్న హైకోర్టు విగ్రహ ఏర్పాటుపై స్టే విధించింది. అయితే కృష్ణుడి విగ్రహమైనా లేదంటే ఎన్టీఆర్ విగ్రహమైనా పెట్టుకోవచ్చని కానీ కృష్ణుడి రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. కృష్ణుడి వేషధారణలో ఉన్న ఎన్టీఆర్ 54 అడుగులు విగ్రహాన్ని ఖమ్మం లకారం చెరువులో ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తుండగా తానా సభ్యులు, ఎన్నారైలు, పారిశ్రామిక వేత్తలు తమవంతు సాయం అందిస్తున్నారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఈనెల 28న ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. మొత్తం రూ.4 కోట్ల ఖర్చుతో ఈ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నారు. హైదరాబాద్‌లో ఈ విగ్రహం రూపుదిద్దుకుంటోంది. ఖమ్మం లకారం చెరువులో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించడానికి జూనియర్ ఎన్టీఆర్‌ను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఇప్పటికే ఆహ్వానించారు. జూనియర్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్లి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ మేరకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. అయితే, ఈ విగ్రహ ఏర్పాటు గురించి ప్రకటించినప్పటి నుంచీ కొంత మంది హిందూ వాదులు, యాదవ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News