Monday, December 23, 2024

హిందూ మహాసముద్రంలో మునిగిన చైనా చేపల పడవ!

- Advertisement -
- Advertisement -

సహాయక విమానాన్ని పంపిన భారత నావికా దళం

న్యూఢిల్లీ: 39 మంది సిబ్బందితో మునిగిపోయిన చైనా చేపల పడవను కాపాడడానికి, వెతకడానికి భారత నావికా దళం పి81 సముద్ర గస్తీ విమానాన్ని పంపింది. ప్రతికూ వాతావరణం ఉన్నప్పటికీ భారత విమానం చాలా శోధించింది. మునిగిపోయిన నౌకకు చెందిన అనేక వస్తువులను గుర్తించింది.
చైనా చేపల పడవ లూ పెంగ్ యువాన్ వై మునిగిపోగా, మానవతా చర్యలో భాగంగా భారత నావికా దళం తన విమానాన్ని పంపింది. భారత దేశానికి దాదాపు 900 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న దక్షిణ హిందూ మహాసముద్రంలో వెతికింది. మునిగిపోయిన చైనా పడవ సిబ్బందిలో చైనా, ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌కు చెందిన పౌరులు ఉన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News