హైదరాబాద్: జుడిషియరీతో తరచూ వివాదాలకు దిగడం వల్లనే రిజిజూను న్యాయశాఖ నుంచి తప్పించారనే వాదనను ఈ మంత్రిత్వశాఖలోకి కొత్తగా వచ్చిన అర్జున్ రామ్ మేఘ్వాల్ తెలిపారు. కేబినెట్‌లో మార్పులు సహజసిద్ధం అన్నారు. తనపై విశ్వాసం ఉంచి ఈ బాధ్యత అప్పగించినందుకు ప్రధానికి తాను కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని చెప్పారు. రాజ్యాంగం ఓ పెద్ద గ్రంధం, మనకు అవసరం అయిన ప్రతి విషయాన్ని రాజ్యాంగం తెలియచేస్తుందని స్పందించారు.
జుడిషియరీపై తరచూ విమర్శలకు దిగినందున ఆయన అర్థాంతర మార్పిడి జరిగిందడం కుదరదని తేల్చిచెప్పారు. మేఘ్వాల్ రాజస్థాన్‌కు చెందిన వారు. తమ రాష్ట్రంలో ఈ ఏడాది జరిగే ఎన్నికల నేపథ్యంలో ఈ కీలక పదవి అప్పగించారనే అంశం కేవలం ఊహాగానమే అన్నారు. కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థకు మధ్య సత్సంబంధాలు ఉండనే ఉన్నాయి. ఇవి రాజ్యాంగపరంగా కొనసాగుతాయి. ఇక వీటి పరిమితులకు సంబంధించిన స్పష్టమైన రేఖలు ఉండనే ఉన్నాయని తెలిపారు.