Tuesday, November 26, 2024

మాట నిలబెట్టుకున్న సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

రంగారెడ్డి : 84 గ్రామాల ప్రజల పాలిట దేవుడిగా మారిన తెలంగాణ సిఎం కెసిఆర్‌కు ప్రజలు జై కొడుతున్నారు. ఎలాంటి తప్పు చేయకపోయిన 27 సంవత్సరాలుగా 84 గ్రామాల ప్రజలు ఎదురుకుంటున్న శాపానికి తెలంగాణ సిఎం కెసిఆర్ విముక్తి కల్పించారు. 1996లో రంగారెడ్డి జిల్లాలోని 84 గ్రామాలను జి.ఓ 111 పరిధిలోకి తీసుకువచ్చి నాటి ప్రభుత్వం చేసిన పాపంను కెసిఆర్ ప్రభుత్వం పూర్తిగా ఎత్తివేస్తు నిర్ణయం తీసుకోవడంపై ఆయా గ్రామాల ప్రజల్లో అనందం వెల్లివిరుస్తుంది. ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరువుల పరిరక్షణ పేరుతో జి.ఓ 111 తీసుకు వచ్చిన ప్రభుత్వం 84 గ్రామాల పరిధిలో విదించిన అంక్షలతో స్థానికంగా అభివృద్ధ్ది పూర్తిగా కుంటు పడింది.

84 గ్రామాలకు పక్కనున్న గ్రామాల్లో భూముల ధరలు ఇప్పటికే ఆకాశాన్ని తాకగా ఇక్కడ మాత్రం అందుకు భిన్నంగా పరిస్థితులు ఉన్నాయి. మహానగరానికి ఆనుకుని ఔటర్ రింగ్ రోడ్డు చుట్టు పక్కల ఉన్నప్పటికి జి.ఓ 111 అమలులో ఉండటంతో ఇక్కడ అభివృద్ధ్ది చేయడానికి ఆస్కారం లేకుండా పోయింది. తెలంగాణ ప్రభుత్వం ఎర్పడిన తర్వాత జి.ఓ 111 ఎత్తివేస్తామని హామీ ఇచ్చిన పిదప కొంత వరకు భూముల ధరలు పెరగడంతో పాటు అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. గత సంవ త్సరం ప్రభుత్వం జి.ఓ 111 పై ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసిన అనంతరం మరింత వేగంగా ప్రాంతంలో ముందుకు సాగింది.

జంట జలాశయాలను పరిరక్షించడానికి ఎగువ ప్రాంతంలో 11 ఎస్‌టిపిలను పెద్ద ఎత్తున నిర్మాణం చేయడానికి ఏర్పాట్లు చేయడంతో పాటు జలాశయాలను పరిరక్షించడానికి సైతం ప్రణాళిక బద్ధ్దంగా సాగుతుంది. కొండ పోచమ్మ ప్రాజెక్టు నుంచి జంట జలాశయాలకు మంచినీరు తీసుకువచ్చి నింపడానికి సైతం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
జెట్ స్పీడ్‌లో మారనున్న రూపురేఖలు
జి.ఓ 111 ఎత్తివేస్తు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఒక్కసారిగా 84 గ్రామాల రూపురేఖలు మారనున్నాయి. చెవెళ్ల, రా జేంద్రనగర్, షాద్‌నగర్ నియోజకవర్గాల పరిధిలోని 84 గ్రామాలున్నాయి. ఔటర్‌కు అనుకుని ఉన్న మొయినాబాద్ మండలం, శంషాబాద్, మండలాలతో పాటు శంకర్‌పల్లి, షాబాద్, కొత్తూర్, గండిపేట్, చెవెళ్ల మండలాల్లో ఇక జెట్ స్పీడ్‌తో ముందుకు సాగనున్నాయి. హెచ్‌యండిఎ పరిధిలో ఉన్న నియమ నిబందనలు ఈ ప్రాంతంకు వర్తిసాయని ప్రభుత్వం స్పష్టం చేయడంతో రియల్ రంగం పరుగులు పెట్టనుంది. 84 గ్రామాల పరిధిలో ఇప్పటివరకు నిర్మాణాలకు అనుమతులు లేకపోగా ఇకపై బహూళ అంతస్తుల నిర్మాణాలతో పాటు విల్లాలు రానున్నాయి. గతంలో గ్రామ కంఠం లో జి ప్లస్ 1కు మాత్రమే నిర్మాణంకు అనుమతులు ఉండగా బయట వేయి గజాలలో వంద గజాలలో మాత్రం నిర్మాణంకు అనుమతులు ఇచ్చేవారు కాని నేడు పూర్తిగా పరిస్థితులు మారనున్నాయి.

84 గ్రామాల పరిధిలో నిర్మాణాలకు అనుమతులు లేకపోవడంతో నిర్మాణ రంగంకు, ఇంటి నిర్మాణంకు బ్యాంకర్లు నయాపైసా రుణాలు ఇచ్చేవారు కాదు. ప్రస్తుతం ప్రభుత్వ నిర్ణయంతో రియల్ వ్యాపారం పరుగులు పెట్టడంతో పాటు లేఆవుట్‌లకు అనుమతులు ఇవ్వనున్నారు. ప్రభుత్వ ఖజానాకు కాసుల పంట పండటంతో పాటు నిర్మాణ రంగంకు బ్యాంకు రుణాలు రానుండటంతో పెద్ద ఎత్తున లేఆవుట్‌లు రావడం, బహూళ అంతస్తుల భవనాలు రానుండటంతో ప్రాంత రూపురేఖలు పూర్తిగా మారనున్నాయి. హైటెక్ సిటికి సమీపంలో మొయినాబాద్, శంషాబాద్, శంకర్‌పల్లి, షాబాద్ మండలాలు ఉండటంతో పాటు మహనగర విస్తరణకు కావలసిన వనరులు ఇక్కడ పుష్కలంగా ఉండటంతో ఒక్కసారిగా ప్రాంతంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు రానున్నాయి. 84 గ్రామాల్లో కాలుష్యరహిత పరిశ్రమలు రానుండటంతో పాటు నిర్మాణ రంగం జెట్ స్పీడ్‌లో దూసుకుపోవడం ఖాయం కావడంతో స్థానికులకు ఉద్యోగ ఉపాది అవకాశాలు సైతం లబించనున్నాయి.
మాట నిలబెట్టుకున్న సిఎం
తెలంగాణ సిఎం కెసిఆర్ 84 గ్రామాల ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ సమయంతో పాటు 2014 ఎన్నికల సమయంలో జి.ఓ 111 ఎత్తివేస్తామని సియం కెసిఆర్, 2018 ఎన్నికల సమయంలో కెటిఆర్ ఇచ్చిన హామీలను నిలబెట్టుకున్నారు. 84 గ్రామాల ప్రజలు కెసిఆర్‌కు రుణపడి ఉంటామని స్వచ్ఛందంగా పెర్కొంటున్నారు. పార్టీలకు అతీతంగా ప్రజలు అంత ముక్తకంఠంతో జయహో కెసిఆర్ అంటు నినదిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News