Monday, December 23, 2024

ఇప్పటికీ ఫోన్ వాడని సిద్ధరామయ్య

- Advertisement -
- Advertisement -

బెంగళూరు ః కార్యదక్షతకు మారుపేరుగా ఉన్న సిఎం సిద్ధరామయ్య కర్నాటకలో ఇంతకు ముందు 2013 నుంచి 2018 వరకూ విజయవంతంగా సిఎంగా బాధ్యతలు నిర్వర్తించారు. అసంపూర్తి పదవీకాలంతో సాగిన సిఎంలకు అతీతంగా సిద్ధరామయ్యకు రికార్డు ఉంది. ఈరోజు వరకూ ఆయన ఎప్పుడూ సొంతంగా ఫోన్ వాడలేదు.

దీనితో ఆయనను మిగతా ప్రపంచం , ఇతర అగ్రనేతలు సంప్రదించాలనుకుంటే ముందుగా వ్యక్తిగత సహాయకులతో మాట్లాడి సమయం తీసుకోవల్సి ఉంటుంది. ఈసారి సిద్ధరామయ్య కాంగ్రెస్ పార్టీ తరఫున పేదలకు నెలకు పదికిలోల బియ్యం, యువతకు , మహిళలకు ఆర్థిక సాయం భరోసాలు హామీ ఇవ్వడం కలిసివచ్చింది. తనకు పార్టీ కన్నా పేద ప్రజలే మూలశక్తి అని తరచూ సిద్ధరామయ్య చెపుతూ వచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News