న్యూస్‌డెస్క్: ఓవర్ స్పీడ్‌తో కారును నడుపుతున్న ఒక వ్యక్తి పోలీసులు పట్టుకునేసరికి కారును తాను నడపడం లేదని, తన పెంపుడు కుక్క నడుపుతోందంటూ ఆ వ్యక్తి పోలీసుల వద్ద బుకాయించే ప్రయత్నం చేశాడు. అమెరికాలోని కొలరాడో రాష్ట్రం స్ప్రింగ్‌ఫీల్డ్‌లో శనివారం ఈ సంఘటన చోటు చేసుకుంది. గంటకు 30 మైళ్ల వేగంతో నడపాల్సిన చోట గంటకు 52 మైళ్ల వేగంతో దూసుకెళుతున్న కారును స్ప్రింగ్‌ఫీల్డ్ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులను చూసిన వెంటనే డ్రైవింగ్ సీట్లో ఉన్న వ్యక్తి పక్క సీట్లోకి మారిపోయి పక్కసీట్లో ఉన్న తన పెంపుడు శునకాన్ని డ్రైవింగ్ సీట్లో కూర్చోపెట్టాడు.
Also Read: ఒక పక్క ఎండలు.. మరో వైపు జల్లులు
ఓవర్ స్పీడ్ నేరంపై పోలీసులు కేసు నమోదు చేయబోగా కారును తాను నడపడం లేదని, తన శునకం నడుపుతోందంటో అతడు బుకాయించాడు. అయితే పోలీసులు గట్టిగా నిలదీయడంతో ఆ వ్యక్తి అక్కడి నుంచి పరారయ్యే ప్రయత్నం చేశాడు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని బ్రాకా కౌంటీ జైలుకు తరలించారు. కారులో ఉన్న శునకాన్ని నిందితుడి సన్నిహితులకు అప్పగించారు. ఈ విషయాన్ని స్ప్రింగ్‌ఫీల్డ్ పోలీసులు తమ అధికారిక ఫేస్‌బుక్ అకౌంట్‌లో వెల్లడించారు.