Monday, December 23, 2024

వేసవి తాపం…. స్కూటర్‌పై యువజంట స్నానం (వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: వేసవి తాపం తట్టుకోలేక ఒక జంట పట్టపగలు నడిరోడ్డుపై స్కూటర్‌లో వెళుతూ స్నానం చేయడం సంచలనం సృష్టించింది. మహారాష్ట్రలోని థాణె జిల్లా ఉల్హాస్‌నగర్ పట్టణంలో మే 17న జరిగిన ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆ జంటపై కేసు నమోదు చేశారు. వినోదం పేరుతో పబ్లిక్ న్యూసెన్స్ చేసినందుకు ఆ జంటపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉల్హాస్‌గనర్‌లోని బిజీ జంక్షన్‌లో జరిగిన ఈ సంఘటనపై వి డిజర్వ్ బెటర్ గవర్న్‌మెంట్ @ ఇట్స్ ఆమ్ ఆద్మీ అనే ట్విటర్ ఖాతాదారుడు ఈ వీడియోను పోస్టు చేసి పోలీసులు స్పందించాలని కోరాడు. స్పందించిన థాణె పోలీసులు దీనిపై తదుపరి చర్యల నిమిత్తం స్థానిక ట్రాఫిక్ పోలీసులకు ఉత్తర్వులు జారీచేశారు.

Also Read: ఫేస్‌బుక్‌లో లైవ్ పెట్టి ఉరేసుకున్నాడు…. వీడియో వైరల్

ఉల్హాస్‌నగర్‌లోని బిజీ సెక్షన్ 17 మెయిన్ సిగ్నల్ వద్ద ఒక జంట వినోదం పేరిట స్కూటర్‌పై స్నానం చేస్తూ న్యూసెన్స్ క్రియేట్ చేసిందని, ఇతరులెవరూ ఇటువంటి చర్యలకు పాల్పడకుండా పోలీసులు కఠినంగా చర్యలు తీసుకోవాలని వి డిజర్వ్ బెటర్ గవర్న్‌మెంట్ కు ట్వీట్ చేసింది. మహారాష్ట్ర డిజిపికి కూడా ట్యాగ్ చేసింది. థాణె జిల్లాలో గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా ఉష్ణోగ్రత 40 డిగ్రీల వరకు నమోదవుతోంది. వేనవి తాపాన్ని భరించలేని స్థితిలో ఉన్న ప్రజలు ఇళ్లకే పరిమితమవుతుండగా ఒక యువ జంట మాత్రం ప్రస్తుత పరిస్థితిని వినోదాత్మకంగా చిత్రించే ప్రయత్నంలో పోలీసుల వద్ద అడ్డంగా బుక్ అయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News