Sunday, December 22, 2024

అవినాష్ రెడ్డి తల్లికి గుండెపోటు… విచారణకు రాలేను

- Advertisement -
- Advertisement -

 

హైదరాబాద్: సిబిఐ కార్యాలయానికి అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు చేరుకున్నారు. అవినాష్ రెడ్డి తల్లికి అనారోగ్యం పాలు కావడంతో అతడు పులివెందులకు వెళ్లారని న్యాయవాది మల్లారెడ్డి తెలిపారు. సిబిఐ విచారణకు బయల్దేరాక అవినాష్ తల్లికి అనారోగ్యంపై సమాచారం వచ్చిందని, అవినాష్ తల్లికి గుండెపోటు రావడంతో ఆస్పత్రిలో చేర్చారన్నారు. పులివెందుల ఆస్పత్రిలో అవినాష్ రెడ్డి తల్లికి చికిత్స జరుగుతోందన్నారు. అవినాష్ రెడ్డి తల్లికి అనారోగ్యంపై సిబిఐకి సమాచారం ఇచ్చామని, విచారణకు మరో తేదీ ఇవ్వాలని సిబిఐని కోరామన్నారు. తన తండ్రి జైల్లో ఉండటంతో తన తల్లిని తానే చూసుకోవాలని సిబిఐకి ఎంపి అవినాష్ రెడ్డి సమాచారం ఇచ్చారు.

Also Read: కూకట్‌పల్లిలో ప్రియుడితో కలిసి భర్తను చంపి… అగ్నిప్రమాదంగా చిత్రీకరించారు…

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News