Friday, December 20, 2024

మీడియాపై ఎంపి అవినాష్ అనుచరులు దాడి చేయడం సరికాదు: గవర్నర్

- Advertisement -
- Advertisement -

అమరావతి: ఎంపి అవినాష్ అనుచరులు మీడియాపై దాడి చేయడం సరికాదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. మీడియాపై ఎంపి అవినాష్ రెడ్డి అనుచరులు దాడిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఖండించారు. దాడి విషయం గురంచి తెలంగాణ గవర్నర్ దృష్టికి మీడియా ప్రతినిధులు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Also Read:  నేరం నాది కాదు.. నా శునకానిది

హైదరాబాద్‌లో మీడియా ప్రతినిధులపై దాడిని బిజెపి నేత సోము వీర్రాజు ఖండించారు. ఎంపి అవినాష్ రెడ్డి అనుచరుల దాష్టీకాన్ని అందరూ అడ్డుకోవాలని సూచించారు. వైసిపి ప్రభుత్వ పెద్దలు క్షమాపణ చెప్పించాలని వీర్రాజు డిమాండ్ చేశారు. వార్తలు రాస్తే దాడులు చేయించడం సమంజసం కాదని హెచ్చరించారు. వైసిపి ప్రభుత్వ అవినీతిపై ఛార్జిషీట్ దాఖలు చేస్తామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News