Friday, November 22, 2024

17 రైళ్ల రద్దు.. మరికొన్ని రైళ్ల రీషెడ్యూల్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సికింద్రాబాద్ డివిజన్ పరిధిలో పలు రైళ్లను రద్దు చేస్తూ దక్షిణమధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. ఘట్‌కేసర్, చర్లపల్లి రైల్వేస్టేషన్ల మధ్య కొనసాగుతున్న రైల్వే కోచ్ టెర్మినల్ పనుల నేపథ్యంలో ఈనెల 21వ తేదీన 17 రైళ్లను రద్దు చేస్తున్నట్టు అలాగే ఈ నెల 20, 21 తేదీల్లో కొన్ని రైళ్లు రీ షెడ్యూల్ చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. రద్దు చేసిన రైళ్లలో సికింద్రాబాద్- టు వరంగల్, హైదరాబాద్ టు -కాజీపేట, కాచిగూడ- టు మిర్యాలగూడ, సికింద్రాబాద్ టు -రేపల్లె, హైదరాబాద్- టు సిర్పూర్ కాగజ్‌నగర్, సికింద్రాబాద్ టు -గుంటూర్, సికింద్రాబాద్ టు-సిర్పూర్ కాగజ్‌నగర్ రైళ్లు ఉన్నాయి. వీటితో పాటు మరో ఐదు రైళ్లు ఆలస్యంగా నడువనున్నాయి.

ఆ రూట్‌లో ప్రత్యేక రైళ్లు..
వేసవి ప్రయాణికుల రద్దీ నియంత్రణ కోసం సికింద్రాబాద్ నుంచి దానాపూర్, దిబ్రూగఢ్‌కు ప్రత్యేక రైళ్లను నడిపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి బీహార్‌లోని దానాపూర్‌కు, అసోంలోని దిబ్రూగడ్‌కు రైళ్లు నడుపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే పేర్కొంది. సికింద్రాబాద్ టు -దానాపూర్ మధ్య (రైలు నంబర్ 07419) ఈ నెల 20, 27 తేదీల్లో సాయంత్రం 3.15కి బయలుదేరి ఆదివారం రాత్రి 11.15 గంటలకు దానాపూర్ చేరుకుంటుంది.

దానాపూర్- టు సికింద్రాబాద్ మధ్య
దానాపూర్- టు సికింద్రాబాద్‌ల మధ్య ( రైలు నంబర్ 07420 మే 22, 29) తేదీల్లో నడువనుంది. ప్రతి సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ఈ రైలు బయలుదేరి మంగళవారం రాత్రి 11.50 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైళ్లు రెండు వైపులా కాజీపేట, పెద్దపల్లి, బెల్లంపల్లి, సిర్పూర్ కాగజ్‌నగర్, బల్హార్ష నాగ్‌పుర్, ఇటార్సి, పిపారియా, జబల్‌పూర్, కట్ని, సత్నా, ప్రయాగ్‌రాజ్, పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ, బక్సర్ రైల్వే స్టేషన్‌లలో ఆగుతుందని అధికారులు తెలిపారు.

సికింద్రాబాద్- టు దిబ్రూగఢ్‌ల మధ్య
ఇక సికింద్రాబాద్- టు దిబ్రూగఢ్‌ల మధ్య ( రైలు నంబరు 07046) ఈ నెల 22, 29 తేదీల్లో నడుపనున్నట్టు దక్షిణమధ్య రైల్వే తెలిపింది. ప్రతి సోమవారం ఉదయం 11 గంటలకు ఈ రైలు బయలుదేరి బుధవారం రాత్రి 8.50కి దిబ్రూగఢ్ చేరుకుంటుంది. దిబ్రూగఢ్- టు సికింద్రాబాద్‌ల మధ్య ( రైలు నంబర్ 07047) మే 18, 25, జూన్ 1 తేదీల్లో ఈ రైలు నడుస్తుందని, ప్రతి గురువారం ఉదయం 9.20 గంటలకు బయలుదేరి రైలు శనివారం సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని దక్షిణమధ్య రైల్వే తెలిపింది.

నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరులలో….
రెండు వైపులా ప్రయాణాల్లో ఈ రైలు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమహేంద్రవరం, సామర్లకోట, దువ్వాడ, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, పలాస స్టేషన్‌లలో ఆగుతాయి. భువనేశ్వర్, కటక్, న్యూజల్పాయ్‌గురి, గుహవాటి మీదుగా సికింద్రాబాద్-, దిబ్రూగఢ్‌కు చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News