- Advertisement -
న్యూఢిల్లీ: రూ. 2000 నోటును భారత రిజర్వు బ్యాంకు ఉపసంహరించుకోబోతున్నది. వాటిని మార్చుకునే ఆఖరు తేదీ 2023 సెప్టెంబర్ 30. రూ.2వేల నోట్లను సర్కులేషన్‌లో ఉంచొద్దని ఆర్‌బిఐ బ్యాంకులను ఆదేశించింది. రూ. 3.52 లక్షల కోట్ల విలువైన రూ. 2వేల నోట్లు చలామణిలో ఉన్నట్లు భావిస్తున్నారు. దేశంలో ఉన్న 19 ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయాల్లో రూ. 2వేల నోట్లు మార్పిడి చేసుకోవచ్చు. వినియోగదారులకు రూ. 2వేల నోట్లు ఇవ్వడం తక్షణమే నిలిపివేయాలని ఆర్‌బిఐ ఆదేశం. బ్యాంకు కార్యకలాపాలకు ఇబ్బంది లేకుండా నోట్లు మార్చుకోవాలని సూచించింది. ఒక విడుతలో రూ 20 వేలు మాత్రమే మార్చుకునే అవకాశాన్ని కల్పించింది.
- Advertisement -