Friday, November 22, 2024

కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన విఆర్‌ఏలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విఆర్‌ఏలను రెగ్యులరైజ్ చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో సిఎం కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విఆర్‌ఏలను రెగ్యులరైజ్ చేస్తూ గురువారం కేబినెట్‌లో నిర్ణయం తీసుకున్నందుకు వారు సిఎం కెసిఆర్‌కు, మంత్రులు కెటిఆర్, హరీష్‌రావులకు కృతజ్ఞతలు తెలిపారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో విఆర్‌ఏలు సిఎం చిత్రపటానికి పాలాభిషేకం చేసి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.

సిద్దిపేట జిల్లాలో సిఎం కెసిఆర్, మంత్రి హరీష్‌రావుల చిత్రపటాలకు, ఆదిలాబాద్, సుల్తానాబాద్‌లో ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి విఆర్‌ఏలు క్షీరాభిషేకం చేశారు. విఆర్‌ఏలను క్రమబద్ధీకరిస్తూ ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలోని 23 వేల మంది విఆర్‌ఏలకు లబ్ధి జరుగనుందని విఆర్‌ఏ సంఘం నాయకులు పేర్కొన్నారు. దశాబ్ధి వేడుకల సందర్భంగా తమ కుటుంబాలకు శుభవార్త చెప్పడం సంతోషంగా ఉందని వారు సంతోషం వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News