Saturday, November 23, 2024

సైబరాబాద్‌లో ట్రాఫిక్ ఆంక్షలు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః ఎన్‌టిఆర్ పుట్టిన రోజు వేడుకల సందర్భంగా కూకట్‌పల్లి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తూ సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి ఆదేశాలు జారీ చేశారు. ఎన్‌టిఆర్ 100 పుట్టిన రోజు వేడుకలు శనివారం ఖైత్లాపూర్ గ్రామంలో నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1 గంటల నుంచి రాత్రి 11గంటల వరకు వేడుకలు నిర్వహించనున్నారు. ఈ వేడుకలకు ఎన్‌టిఆర్ అభిమానులు 20 వేల మంది వరకు హాజరుకానున్నారు. వాహనదారులకు ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు పోలీసులు ముందుగానే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. వాహనదారులు ట్రాఫిక్ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యామ్నాయమార్గంలో వెళ్లాలని కోరారు.

మూసాపేట నుంచి కెపిహెచ్‌బి ఫోర్త్‌ఫేస్, హైటెక్ సిటీ వైపు వెళ్లే వాహనాలు మూసాపేట ఎక్స్ రోడ్డు ,కూకట్‌పల్లి బస్‌స్టాప్, జెఎన్‌టియూ జంక్షన్ వైపు వెళ్లాలి.ఐడిఎల్ లేక్ నుంచి మాదాపూర్, హఫీజ్‌పేట వెళ్లే వాహనాలను ఐడిఎల్ జంక్షన్, కూకట్‌పల్లి బస్‌స్టాప్, కెపిహెచ్‌బి రోడ్డు నంబర్ 1, జెఎన్‌టియూ జంక్షన్ వైపు వెళ్లాలి. హైటెక్‌సిటీ నుంచి కూకట్‌పల్లి, మూసాపేట్ వైపు వచ్చే వాహనాలు కెపిహెచ్‌బి ఫోర్త్ ఫేస్, లోధా అపార్ట్‌మెంట్, కెపిహెచ్‌బి రోడ్డునంబర్ 1 వైపు మళ్లిస్తారు. పర్వత్‌నగర్, మాదాపూర్ నుంచి కూకట్‌పల్లి, మూసాపేట్ రోడ్డు వైపు వెళ్లే వాహనాలను ఎస్‌బిఐ సిగ్నల్, ఎన్‌ఐఏ వద్ద లెఫ్ట్‌టర్న్‌తీసుకుని, 100 ఫీట్ సిగ్నల్ వద్ద యూటర్న్ తీసుకుని వెళ్లాలి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News