Friday, January 10, 2025

ఆచరణకు నోచుకోని నూతన విద్యావిధానం!

- Advertisement -
- Advertisement -

విద్యార్థులు సమగ్ర వికాసం పొందేలా కస్తూరి రంగన్ కమిటీ విడుదల చేసిన జాతీయ విద్యా విధానం నివేదిక అనేక తర్జనభర్జనల మధ్య కేంద్ర కేబినెట్ ఆమోదించింది. ఈ నివేదికలోని అంశాల్లో ముఖ్యంగా విద్యాహక్కు చట్టాన్ని మూడు నుంచి 18 ఏండ్ల వరకు విస్తరించాలనే సిఫారసు, ప్రీ ప్రైమరీ విద్య, టీచర్ ఎడ్యుకేషన్లను బలోపేతం చేయాలనడం, సెకండరీ విద్యలో కోచింగ్ ప్రభావాన్ని, పరీక్షల ప్రభావాన్ని తగ్గించే ఆలోచనలు, కరిక్యులర్, కో కరిక్యులర్ విభజనను తొలగించడం, వొకేషనల్ విద్యతో సమైక్యపరచడం, సైంటిఫిక్ టెంపర్‌ను పెంచాలనే సిఫార్సులు, ఉన్నత విద్యలో లిబరల్ ఆర్ట్ కోర్సులకు ప్రాధాన్యం, ప్రైవేట్ సంస్థలు తమ సంస్థల పేర్లలో పబ్లిక్ ఆపడాన్ని వాడకూడదని సూచన, మానవ వనరుల అభివృద్ధి శాఖ ను విద్యాశాఖగా మార్చాలనే సూచన, విద్యకు బడ్జెట్ పెంపు, విద్యా సంస్థల స్వయం ప్రతిపత్తి గురించిన ప్రతిపాదనలు చూసినప్పుడు

నివేదిక అమలుకు సాధ్యం అవుతుందా? అనే భావన కలిగింది. ఈ నూతన విద్యా విధానం 2020 సంబంధించి వెలువడిన డ్రాఫ్టును అందరికంటే ముందుగా బిజెపి మార్గదర్శక సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ ఘనంగా స్వాగతించింది. నూతన జాతీయ విద్యా విధానంలో సగానికి పైగా మా సలహాలతో తయారు చేసినవేనని ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థలైన భారతీయ శిక్షన్ మండల్ భారతీయ భాషా మంచ్ నిర్మొహమాటం లేకుండా ప్రకటించాయి. విద్యా విధానం పై పార్లమెంట్‌లో చర్చ జరిగిన తర్వాతనే ఆమోదం తెలిపాయి. కోవిడ్ సంక్షోభంలో సతమతమవుతున్న సమయాన్ని ఇలాంటి కీలక 2020 నూతన విద్యా విధానం పార్లమెంట్‌లో చర్చ లేకుండా ఆమోదింపచేసింది. పరిమాణాత్మక విద్య కంటే ప్రభుత్వ విద్య నాణ్యతపై ఎక్కువగాదృష్టి కేంద్రీకరించింది. అయితే ప్రభుత్వం విద్య పరిమాణాత్మక దృక్పథాన్ని దెబ్బతీస్తుందనే భావం నెలకొంది.
స్వాతంత్య్రానంతరం అందరికీ సమానంగా విద్యావకాశాలను, వాటి ఫలితాలను అందజేయడంలో పాలక పక్షాలు వైఫల్యం చెందాయి. అందరికీ విద్య ను ప్రభుత్వం కల్పించాలి,

అలాంటిది రాజ్యాంగ నిర్దేశిత బాధ్యత నుంచి ప్రభుత్వాలు క్రమంగా సంపన్న వర్గాల ప్రభావం పడడం వలన ప్రైవేట్ భాగస్వామ్యం పెరిగిపోయింది. విద్యను వ్యాపార కేంద్రాలుగా మార్చి అందని ద్రాక్షగా చేసినాయి. కులాల ప్రాతినిధ్యం పెరగడంతో ఫలితాల్లో వివక్ష జరిగింది. భారత దేశంలో విద్యను ప్రోత్సహించడానికి, నియంత్రించడానికి గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రాథమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు మొట్ట మొదటగా 1968లో ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ, రెండవది 1986లో ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ హయాంలో పార్లమెంట్‌లో చర్చ, విపక్షాల సూచనలు పాటించి అమలు చేసింది. నరేంద్ర మోడీ ప్రధానిగా 2020 జాతీయ విద్యా విధానం సమకాలీన పరిస్థితులకు అనుకూలంగా ఉన్నా ఆచరణకు నోచుకోని విధంగా ఉన్నాయని, విద్య కార్పొరేట్ వ్యాపార అనుకూలంగా, విద్య ప్రైవేటీకరణ చేసేందుకు రూపొందించినట్లు స్పష్టం అవుతుంది.

ఒక పక్క కాషాయీకరణ, ప్రైవేటీకరణ వలన ఎస్‌సి, ఎస్‌టి, ఒబిసి, మైనారిటీ, వికలాంగులకు సామాజిక న్యాయం అంశాన్ని విస్మరించిందనే భావం నెలకొంది. 34 ఏండ్ల తర్వాత ఆమోదం తెల్పిన విద్యావిధానంలోని లోపాలను సవరించేదిగా లేదనే విమర్శ ఉంది. మానవ వనరుల మంత్రిత్వశాఖ పేరును కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖగా మార్చినంత మాత్రా న జాతీయ విద్యా విధాన ముసాయిదా లోపాలను సరిదిద్దుకుంటాయంటే పొరపాటే. ఒకటే దేశం, ఒకటే జాతి అంటూ బిజెపి చేస్తున్న ప్రచారానికి, ప్రయత్నాలకు అనుగుణంగానే ఈ విద్యా విధానం అనేది నిర్వివాదాంశం.
ప్రపంచ వ్యాప్తంగా శాస్త్రసాంకేతిక రంగాల్లో ప్రజలు జీవన విధానాల్లో వచ్చిన మార్పులను అందిపుచ్చుకొని ముందుకు నడిచేందుకు ప్రతి దేశం తమ విద్యా వ్యవస్థను నిత్యం ఆధునీకరించుకుంటుంది. దేశంలో 2014లో అధికారం చేపట్టిన ప్రధాని మోడీ ప్రభుత్వం రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రాలపై నియంత్రణ కోసం నడుం బిగించింది. రెగ్యులర్ వెళ్లి చదువు నేర్చుకోవడం కంటే సార్వత్రిక విద్య విధానం, పరీక్షల కోసం బట్టి విధానం అవలంబించి సర్టిఫికెట్లు పొందే ప్రాముఖ్యత పెరిగింది. ప్రముఖ సామాజిక శాస్త్రవేత్త ‘రొనాల్ డోరె’ డిప్ల్లొమాడిసీజ్ అని వర్ణించారు. దేశంలో వైవిధ్యం ఎక్కువ ఉన్నప్పుడు ప్రాంతీయ అసమానతలు ఉన్నప్పుడు అందరికీ ఒకే పరీక్షా న్యాయమైనది కాదు.
మౌలికమైన సమస్యలు పరిష్కరించకుండా ప్రస్తుతం ఉన్న 10+2+3 నిర్మాణాన్ని 5+3+3+4 మార్చడం, పునర్వ్యవస్థీకరించి ఒక కొత్త బోధనాశాస్త్ర, పాఠ్యప్రణాళికను ప్రవేశపెట్టాలని ఈ విధానం భావిస్తుంది. పిల్లలు ఆరు సంవత్సరాల వయసులో 1వ తరగతి మొదలవుతుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లాంటి మార్పులు పిల్లల సమగ్ర వికాసానికి సంబంధించిన సంస్కరణలలో యునెస్కో అంతర్జాతీయ విద్యా కమిషన్ అయిన ‘డెలర్’ కమిషన్ నివేదిక మార్గదర్శకంగా ఎంచుకోవాలని ఈ ముసాయిదా ప్రముఖంగా పేర్కొన్నది. విద్యా విధానం

కేంద్ర, రాష్ట్రాల మధ్య వివాదాల విధానంగా మార్చింది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా విద్యార్థులు ఆసక్తులను పరిగణనలోకి తీసుకోకుండా వారి మనోవేదనలను అర్థం చేసుకోలేము. కానీ, ఈ ముసాయిదా మన వారసత్వ విజ్ఞానంలోని లోపాలను సరిచేయకుండా కాషాయపు తిరోగమన వారసత్వ విజ్ఞాన సంపదగా ఆమోదం చేసి, అందరికీ విద్యావకాశాలు కల్పించే తీరును జాతీయ విద్యా విధానం తలక్రిందులు చేసిందనే విమర్శ ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News