Saturday, November 23, 2024

మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని ప్రశ్నించిన సిబిఐ

- Advertisement -
- Advertisement -

కోల్‌కతా : పశ్చిమబెంగాల్ పాఠశాల ఉద్యోగాల కుంభకోణం కేసులో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీని సిబిఐ శనివారం ప్రశ్నించింది. అంతకు ముందు రోజు ఈ కుంభకోణంలో టీఎంసి నేతలకు సన్నిహితుడైన సుజయ్ కృష్ణభద్ర నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాడులు నిర్వహించిందని కేంద్ర ఏజెన్సీ అధికారి చెప్పారు. కోల్‌కతా నిజాం ప్యాలెస్‌లో ఉన్న సిబిఐ కార్యాలయానికి భారీ బందోబస్తు మధ్య అభిషేక్ శనివారం వెళ్లారు. ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్ రిక్రూట్‌మెంట్‌లో అక్రమాలకు పాల్పడినట్టు వచ్చిన ఆరోపణలపై మార్చి 15న కృష్ణభద్ర సీబీఐ ఎదుట హాజరయ్యారు.

బంకురాలో జరిగిన ర్యాలీలో అభిషేక్ బెనర్జీ తనపై అవినీతి ఆరోపణలకు రుజువులుంటే అరెస్ట్ చేయండని అన్నారు. ఈ స్కామ్‌లో సిబిఐ, ఈడీ తదితర దర్యాప్తు సంస్థలు తనను విచారించవచ్చని గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలను రీకాల్ చేయాలని కోరుతూ బెనర్జీ దాఖలు చేసిన పిటిషన్‌ను కోల్‌కతా హైకోర్టు గురువారం కొట్టివేసింది. ఇదిలా ఉండగా ఈ కుంభకోణం కేసులో అభిషేక్ బెనర్జీ పేరు పెట్టాలని కేంద్ర దర్యాప్తు సంస్థలు తనపై ఒత్తిడి తెస్తున్నాయని నిందితుడు కుంతల్ ఘోష్ తన ఫిర్యాదులో ఆరోపించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News