Monday, December 23, 2024

అస్సాంలో టీచర్లకు డ్రెస్ కోడ్!

- Advertisement -
- Advertisement -
జీన్స్, లెగ్గింగ్స్‌పై నిషేధం

దిస్ పూర్: అస్సాంలోని హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలోని ఉపాధ్యాయులకు నేడు(మే 20న) డ్రెస్ కోడ్‌ను జారీ చేసింది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్లు జీన్స్, లెగ్గీస్ ధరించకుండా నిషేధం విధించారు. మహిళా, పురుష టీచర్లు ఎవరైనా సరే టిషర్టులు, జీన్స్, లెగ్గింగ్స్ వంటివి పాఠశాలల్లో ధరించరాదని నిబంధన పెట్టారు. పాఠశాల విద్యా శాఖ ఈ మేరకు ప్రకటన జారీచేసింది. పాఠశాలల్లో డీసెన్సీ మెయిన్‌టైన్ చేయాలని ఆదేశించారు. అందుకే డ్రెస్ కోడ్ తెచ్చామని తెలిపారు.
‘కొంత మంది టీచర్లు తమకు నచ్చిన రీతిలో డ్రెస్ చేసుకుంటున్నారు. ఇది పబ్లిక్‌కు నచ్చినట్లు ఉండడంలేదు. డీసెన్సీకి టీచర్లు ఆదర్శంగా ఉండాల్సి ఉంది. ముఖ్యంగా తమ బాధ్యతలు నిర్వహించేప్పుడు. పనిప్రదేశంలో ప్రొఫెషనలిజం కనిపించాలి’ అని పాఠశాల విద్యా శాఖ ప్రకటన పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News