- Advertisement -
హైదరాబాద్ : పర్యావరణ పరిరక్షణ శిక్షణ, పరిశోధనా సంస్థ (ఇపిటిఆర్‌ఐ) మిల్లెట్స్‌పై వెబ్‌నార్‌ను నిర్వహిస్తోంది. ఈ నెల 22న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్భంగా సస్టైనబుల్ అగ్రో బయోడైవర్సిటీ వెబ్‌నార్‌ను నిర్వహించనున్నారు. వివిధ రకాల మిల్లెట్ వంటకాలతో మిల్లెట్ భోజనం, వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమం జరపనున్నారు.
ప్రజలందరికీ అవసరమైన ప్రయోజనాలను అందించడానికి చిరుధాన్యాల సాగు, నియోగాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యమని సంస్థ డైరెక్టర్ జనరల్ వాణీ ప్రసాద్ వెల్లడించారు.‘2050 నాటికి, జీవ వైవిధ్యం విలువలను పునరుద్ధరించడమే ధ్యేయమన్నారు.
- Advertisement -