Saturday, November 16, 2024

వింత వ్యాధితో బాధపడుతున్న ఆరేళ్ల పాప

- Advertisement -
- Advertisement -

గార్ల : ఆరేళ్ల పాపకి భరించలేని కష్టం వచ్చిన ఘటన మహబుబాబాద్ జిల్లా గార్ల మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని చిన్న కిష్టాపురం గ్రామంలో ఆరెళ్ల పాపకు కంట్లో నుంచి బియ్యపు గింజ, ప్లాస్టిక్, ఇనుము, పేపర్లు రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. వివరాలలోకి వెళితే మహబుబాబాద్ జిల్లా కురవి మండలం రాజోలు గ్రామానికి చెందిన భూక్య దశ్రు, దివ్య దంపతులకు రెండోవ సంతానం అయిన సౌజన్య (6) చిన్నప్పటి నుంచి గార్ల మండలం పెద్ద కిష్టాపురం అమ్మమ్మ దగ్గర ఉంటూ ప్రభుత్వ పాఠశాలలో ఒకటోవ తరగతి చదువుకుంటుంది.

Also Read: విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో మూడు ఇండ్లు దగ్ధం

మూడు నెలల క్రితం కంట్లో నుంచి గింజ పడడంతో తల్లి దండ్రులు భయందోళనకు గురై ఖమ్మంలో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించగ అప్పటి నుంచి ఆరోగ్య పరిస్థితి భాగానే ఉంటుంది. కాని శనివారం కూడా మళ్లి కంట్లో నుంచి బియ్యపు గింజ, ప్లాస్టిక్, ఇనుము, పేపర్లు రావడంతో తల్లి దండ్రులు భయందోళనకు గురై మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆసుపత్రికి తీసుకెళ్ళారు. తమ కూతురిని ఆదుకోవాలని తల్లి దండ్రులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News