Friday, December 20, 2024

మధ్యప్రదేశ్ కునో నేషనల్ పార్కు లోకి మరో 3 చీతాలు విడుదల

- Advertisement -
- Advertisement -

భోపాల్ : మధ్యప్రదేశ్ లోని కునోనేషనల్ పార్కు లోకి మరో మూడు చీతాలను ప్రవేశ పెట్టడంతో మొత్తం చీతాల సంఖ్య 6 కు పెరిగాయి. ఈ మూడు చీతాల్లో రెండు అగ్ని, వాయు పేరుగల మగవి. ఒకటి జెమినీ పేరుగల ఆడది. దక్షిణాఫ్రికా నుంచి తీసుకొచ్చిన ఈ మూడింటిని శుక్రవారం పార్కులో ప్రవేశ పెట్టినట్టు ఫారెస్ట్ ప్రధాన చీఫ్ కన్సర్వేటర్ జెఎస్ చౌహాన్ చెప్పారు. ఇవికాక ఆడ నమీబియా చీతాల్లో ఒకదాన్ని మరో రెండు రోజుల్లో స్వేఛ్ఛగా ఫ్రీ రేంజిలో విడిచిపెడతామని చెప్పారు.

నమీబియాకు చెందిన మరో ఆడ చీతా రెండు పిల్లలను పెట్టడంతో ఫ్రీరేంజి లోకి విడిచిపెట్టడం లేదని పేర్కొన్నారు. మూడో ఆడ చీతా అడవి లోకి విడిచిపెట్టడానికి తగిన అర్హత ఇంకా రాలేదన్నారు. గత ఏడాది సెప్టెంబర్ 17లో 8 నమీబియా చీతాలను ప్రధాని నరేంద్రమోడీ కునో నేషనల్ పార్కు లోకి విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. ఆ తరువాత దక్షిణాఫ్రికా నుంచి మరో 12 చీతాలు వచ్చాయి. తీసుకొచ్చిన మొత్తం 20 చీతాల్లో మూడు గత రెండు నెలల్లో ఎన్‌క్లోజర్ల లోనే చనిపోయాయి. సియాయా అనే చీతా ఈ ఏడాది మార్చిలో కునో పార్కు లోనే నాలుగు పిల్లలను పెట్టింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News