- Advertisement -
హైదరాబాద్: నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న మరో యువకుడు శనివారం మృతిచెందాడు. దీంతో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారి సంఖ్య ఐదుకు చేరింది. ఇప్పటి వరకు ఈ ప్రమాదంలో హర్షిత, అంకిత, నితిన్, అమృత్, ప్రసాద్ ప్రాణాలు కోల్పోయారు. నిజాంపేట్‌కు చెందిన విద్యార్థులు కారులో ఓషన్ పార్క్ వెళ్తుండగా నార్సింగి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. వీరు ప్రయాణిస్తున్న కారు లారీని ఓవర్ టేక్ చేయబోవడంతో ప్రమాదం జరిగింది. ఇందు కారు నడుపుతున్న ప్రసాద్‌కు తీవ్ర గాయాలు కావడంతో అస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతిచెందాడు. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో కారులో 12మంది ఉన్నారు. మృతిచెందిన ప్రసాద్ దేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు.
- Advertisement -