Saturday, December 21, 2024

మిగ్ విమాన పటాలానికి బ్రేక్‌లు…

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భారతీయ వాయుసేనకు చెందిన మిగ్ 21 యుద్ధ విమానాల పటాలాన్ని తదుపరి ఉత్తర్వుల వరకూ నిలిపివేశారు. వీటిని విన్యాసాలకు వాడరాదని గ్రౌండింగ్ ఆదేశాలు వెలువరించారు. ఈ నెలారంభంలో మిగ్ 21 యుద్ధ విమానం పైలట్ శిక్షణ దశలో నింగిలోకి ఎగిరిన దశలో రాజస్థాన్‌లో ఓ గ్రామంలోని పూరింటిపై కుప్పకూలిన ఘటనలో ఇంటిలో మంటలు చెలరేగి ముగ్గురు మహిళలు దుర్మరణం చెందారు.

ఈ ఘటనకు కారణాలు ఏమిటీ? మానవ తప్పిదమా? విమాన లోపాలా? సాంకేతిక సమస్యల అనేవి నిర్థారించుకునే వరకూ ఈ మొత్తం మిగ్ విమానాలను కార్యాచరణకు దిగకుండా నిలిపివేస్తారని రక్షణ శాఖ సీనియర్ అధికారులు తెలిపారు. అప్పటివరకూ ఈ మిగ్‌లను వాయుదళ స్థావరాలలో నిలిపివేసి ఉంచుతారని అధికారులు వివరించారు. మిగ్ బైసన్ యుద్ధ విమాన రకంలో భారతీయ వాయుసేన వద్ద 31 యుద్ధ విమానాలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో మిగ్ ఫైటర్లు ఎక్కువగా ప్రమాదాలకు గురి కావడం ఐఎఎఫ్‌కు ఆందోళనకర పరిణామం అయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News