Monday, December 23, 2024

తల్లిదండ్రుల మృతి.. దిక్కు తోచని స్థితిలో చిన్నారులు

- Advertisement -
- Advertisement -

కోరుట్ల: కోరుట్ల మండలం తిమ్మాయపల్లి గ్రామానికి చెందిన భార్యభర్తలు సూర భీమయ్య(34) సూర ప్రేమలత(30) శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించడంతో తిమ్మాయపల్లిలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. సరుకులు తీసుకు రావడానికి కోరుట్లకు వెళ్లిన తల్లిదండ్రులు లారీ ఢీకొనడంతో కానరాని లోకాలకు వెళ్లడంతో ముగ్గురు చిన్నారులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.

విషయం తెలుసుకున్న బిఆర్‌ఎస్ రాష్ట్ర నాయకులు డా. కల్వకుంట్ల సంజయ్ అంతిమ సంస్కారాల కోసం 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బిఆర్‌ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్ ద్వారా మృతుల కుటుంబాలకు అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని కల్వకుంట్ల సంజయ్, దారిశెట్టి రాజేష్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News