Monday, January 20, 2025

లష్కర్‌లుగా విఆర్‌ఎలు !

- Advertisement -
- Advertisement -

డిగ్రీ విద్యార్హత ఉన్న వారికే పేస్కేల్?
సమగ్ర వివరాలు ఇవ్వాలని అన్ని
జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశం
తహసీల్దార్లకు రెండు రకాల
ప్రొఫార్మాలను పంపిన కలెక్టర్‌లు
రేపు విఆర్‌ఎల క్రమబద్ధీకరణపై
సిఎస్ శాంతికుమారి సమీక్ష

మన తెలంగాణ/హైదరాబాద్ : గ్రామ రెవెన్యూ సహాయకుల (విఆర్‌ఏ)లను వివిధ శాఖల్లో సర్దుబాటు చేయడంతో పాటు వారి పదోన్నతులు, పే స్కేల్‌కు సం బంధించి త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకోనున్నట్టుగా తెలిసింది. ఇప్పటికే వారి సర్వీసు క్రమబద్ధీకరణపై ఓ నిర్ణయానికి వచ్చిన ప్రభుత్వం, 3 నుంచి 4 వే ల మంది విఆర్‌ఏలను ఇరిగేషన్ శాఖలోకి (లష్కర్‌గా) నియమించాలని నిర్ణయించినట్టుగా తెలిసింది. తాజా గా ఈ ప్రక్రియ వేగవంతం చేయడంలో భాగంగా సిసిఎల్‌ఏ విఆర్‌ఏల పూర్తి వివరాలను సేకరిస్తోంది. గ్రామ రెవెన్యూ సహాయకుల (విఆర్‌ఏ) సమగ్ర వివరాలు సమర్పించాలని జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది.

దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్లు తహసీల్దార్లకు రెండు రకాల ప్రొఫార్మాలను పంపారు. ఇందులో ప్రతి విఆర్‌ఏ విద్యార్హత ధ్రువపత్రాలను సేకరించి వాటి సాఫ్ట్ కాపీలను వీలైనంత త్వరగా ప్రభుత్వానికి అందజేయాలని కలెక్టర్లు సూచించారు. విఆర్‌ఎల వారసులకు ఉద్యోగాన్ని బదిలీ చేసేందుకు అవసరమైన వివరాల సేకరణకు రెవెన్యూ శాఖ అన్ని జిల్లాలకు ప్రత్యేక ప్రొఫార్మా పంపింది. అనారోగ్యంతో బాధపడుతున్న, వయసు మీదపడ్డ వారికి మెడికల్ ఇన్వాలిడేషన్ చే యించడంతో పాటు వారసత్వ బదిలీ కోసం ప్రతిపాదించే వ్యక్తి వివరాలు, విద్యార్హతలను కూడా అందజేయాలని జిల్లా యంత్రాంగాలను రెవెన్యూ శాఖ ఆదేశించింది.

దీనికితోడు విఆర్‌ఎల క్రమబద్ధీకరణపై ప్ర భుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సోమవారం స మీక్ష సమావేశం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో విఆర్‌ఏల సమాచారాన్ని తెప్పించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం విఆర్‌ఏల క్యాడర్‌స్ట్రెంత్ 24 వే లు కాగా, విధుల్లో మాత్రం 21 వేల మంది విఆర్‌ఏలు పనిచేస్తున్నారు. ప్రస్తుతం ఇందులో నుంచి 3 నుంచి 4 వేల మందిని ఇరిగేషన్ శాఖలోకి (లష్కర్‌లుగా)సర్ధుబాటు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది.

విఆర్‌ఏలకు పేస్కేల్ సాధ్యం కాదు ?
దీంతోపాటు విఆర్‌ఏల ప్రధాన డిమాండ్ అయిన పే స్కేల్ అంశాన్ని తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో యుద్ధప్రాతిపదికన వారి వివరాలను పంపాలని తహసీల్దార్లకు సిసిఎల్‌ఏ నుంచి ఆదేశాలు అందినట్టుగా తెలిసింది. అందులో భాగంగా ఈ వివరాలను సేకరిస్తున్నట్టుగా యూనియన్ నాయకులు పేర్కొంటున్నారు. గౌరవ వేతనంపై నియమితులైన విఆర్‌ఏలకు పేస్కేల్ ఇవ్వడం సాధ్యం కాదని, డిగ్రీ విద్యార్హత ఉన్న వారికి మాత్రమే పేస్కేల్ ఇచ్చి వారిని రెవెన్యూలో కొనసాగించాలని, మిగిలిన వారికి గౌరవ వేతనాన్ని యథాతథంగా ఉంచి రెవెన్యూతో పాటు ఇతర విభాగాల్లో వినియోగించుకోవాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా సమాచారం.

గతంలో ఇచ్చిన వివరాలు సమగ్రంగా…..
గతంలోనూ విఆర్‌ఏల వివరాలను సిసిఎల్‌ఏ సేకరించినప్పటికీ అన్ని జిల్లాల నుంచి సమగ్ర సమాచారం అం దలేదని, ఈ నేపథ్యంలోనే మళ్లీ కలెక్టర్ల నుంచి వివరా లు తీసుకుంటున్నామని సిసిఎల్‌ఏ అధికారులు పే ర్కొంటున్నారు.
విఆర్‌ఏల పేరు, పనిచేస్తున్న గ్రామం, మండలం, తండ్రి పేరు, కులం, విద్యార్హత, అపాయింట్‌మెంట్ తేదీ, ఎలా నియమితులయ్యారు, పుట్టిన తేదీ, ప్రస్తుత వయసు, క్రమశిక్షణ చర్యలు ఏమైనా పెండింగ్‌లో ఉన్నాయా?, విఆర్‌ఏ మొబైల్ నంబర్ తదితర వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News