Monday, December 23, 2024

ముంబైకి సవాల్.. నేడు సన్‌రైజర్స్‌తో కీలక పోరు

- Advertisement -
- Advertisement -

ముంబై: ఐపిఎల్‌లో భాగంగా ఆదివారం జరిగే మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ప్లేఆఫ్ అవకాశాలను సజీవంగా ఉంచుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి ముంబైకి నెలకొంది. హైదరాబాద్ ఇప్పటికే ప్లేఆఫ్ రేసు నుంచి వైదొలిగింది. ఈ మ్యాచ్‌లో గెలిచినా సన్‌రైజర్స్‌కు ఎలాంటి ప్రయోజనం ఉండదు. అయితే ముంబైకి మాత్రం ఇంకా అవకాశాలు మిగిలేవున్నాయి. ఇదిలావుంటే హైదరాబాద్‌తో పోల్చితే బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో ముంబై చాలా బలంగా ఉంది. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే క్రికెటర్లకు కొదవలేదు. అయితే లక్నోతో జరిగిన కిందటి మ్యాచ్‌లో చేజేతులా ఓటమి పాలు కావడంతో జట్టు ఆత్మవిశ్వాసం దెబ్బతిన్నది.

ఇలాంటి పరిస్థితుల్లో సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఎలా ఆడుతుందనేది అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. లక్నో మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ, వికెట్ కీపర్ ఇషాన్ కిషన్‌లు మెరుగైన బ్యాటింగ్‌ను కనబరిచారు. ఈసారి కూడా ఇద్దరిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. సూర్యకుమార్ యాదవ్, నెహాల్ వధెరా, టిమ్ డేవిడ్, కామెరూన్ గ్రీన్ వంటి స్టార్ ఆటగాళ్లు జట్టులో ఉన్నారు. అయినా కిందటి మ్యాచ్‌లో వీరంతా విఫలమయ్యారు. దీంతో గెలిచే మ్యాచ్‌ను ముంబై చేజార్చుకుంది. ఈసారి మాత్రం ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా ఆడాలన్నదే ముంబై లక్షంగా పెట్టుకుంది. ఇక హైదరాబాద్ కూడా చివరి మ్యాచ్‌లో గెలిచి కాస్తయిన పరువును కాపాడుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారీ తేడాతో గెలిస్తే సన్‌రైజర్స్ 9వ స్థానంలో నిలిచే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ ఓడితే పదో స్థానంతో సరిపెట్టుకోక తప్పదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News