Saturday, January 18, 2025

జగిత్యాలలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు దుర్మరణం

- Advertisement -
- Advertisement -

జగిత్యాల: జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం పూడూరు దగ్గర వేగంగా దూసుకొచ్చిన ఓ వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరు ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. పలువురు గాయపడ్డారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. వ్యాన్ టైర్ పంక్చర్ కావడంతోనే ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. మృతులను సునీత, మమతగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News