బెంగళూరు: ఐపిఎల్ సీజన్16లో భాగంగా ఆదివారం జరిగే చివరి లీగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్స్ గుజరాత్ టైటాన్స్‌తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అమీతుమీ తేల్చుకోనుంది. గుజరాత్ ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. దీంతో ఈ మ్యాచ్‌లో గెలిచినా ఓడినా గుజరాత్‌కు ఒరిగేదేమీ ఉండదు. గుజరాత్ తోపాటు చెన్నై, లక్నో జట్లు కూడా ఇప్పటికే ప్లేఆఫ్ బెర్త్ కు చేరుకున్నాయి. మిగిలిన చివరి ప్లేఆఫ్ బెర్త్ కు బెంగళూరు, ముంబై జట్లలో ఒక జట్టుకు మాత్రమే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో గుజరాత్ జట్టు బెంగళూరు పోరుకు సిద్ధం కాగా.. హైదరాబాద్ జట్టుతో ముంబై ఢీకొట్టబోతోంది.
ఈ రెండు మ్యాచ్ లలో అటు ముంబై గెలిచి, బెంగళూరు ఓడితే.. ముంబై నేరుగా ప్లేఆఫ్ బెర్త్ సొంతం చేసుకుంటోంది. అలా కాకుండా ముంబై ఓడి, బెంగళూరు గెలిస్తే.. ఆ జట్టు ప్లేఆఫ్ బెర్త్ దక్కించుకుంటుంది. ఒకవేళ అటు గుజరాత్ పై బెంగళూరు, ఇటు హైదరాబాద్ పై ముంబై గెలిస్తే మాత్రం.. ఏ జట్టుకు రన్ మెరుగ్గా ఉంటుందో ఆ జట్టే ప్లేఆఫ్ కు చేరుకుంటోంది. మరి ఈ కీలక మ్యాచ్ ల్లో ఏ జట్టు విజయం సాధించి ప్లేఆఫ్ బెర్త్ ను సొంతం చేసుకుంటుందోనని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.