Tuesday, November 26, 2024

ప్రాదేశిక స్థితి పటిష్టతకు సంఘటిత కృషి

- Advertisement -
- Advertisement -

జి 7 వేదిక నుంచి ప్రధాని మోడీ పిలుపు
ఉక్రెయిన్ పరిస్థితిపై విశ్లేషణ
సంప్రదింపులతో పరిష్కారం
బుద్ధుని బోధనల ప్రస్తావన

హిరోషిమా : ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైనా, ఎప్పుడైనా భౌగోళిక ప్రాదేశికత కీలకం అని, ఈ యధాతథ స్థితిని మార్చే ఎటువంటి ఏకపక్ష యత్నాలనైనా నివారించాల్సి ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు నిచ్చారు. ఇందుకు అంతా కలిసి సంఘటితంగా వ్యవహరించాలని తెలిపారు. జపాన్‌లోని హిరోషిమాలో జి 7 సదస్సు ముగింపు దశలో ప్రధాని మోడీ ఉక్రెయిన్‌లో ప్రస్తుత పరిస్థితిపై మాట్లాడారు. ఏ ప్రాంతపు యధాతథస్థితి అయినా ఆయా ప్రాంతాలకు ప్రాణప్రదమే అవుతుంది. ఉక్రెయిన్‌లో ఇప్పుడు మానవతా, మానవీయ అంశాల విషయం . ఇది రాజకీయ, ఆర్థిక సంబంధితం కాదని తెలిపిన మోడీ ఏ దేశం అయినా ఇతర దేశాల ప్రాదేశిక సమగ్రతలకు కట్టుబడి ఉండాల్సిందే.

అదే విధంగా అంతర్జాతీయ చట్టాల నిర్ధేశిత పరిధిలోనే వ్యవహరించాల్సి ఉంటుందన్నారు. ఎటువంటి వివాదం, ఉద్రిక్తతలను అయినా సంప్రదింపుల క్రమంలో శాంతియుతంగా పరిష్కరించుకోవల్సి ఉంటుందని ప్రధాని సూచించారు. ఉక్రెయిన్‌లో నెలకొన్న సంక్షోభం గురించి తాము శనివారం జెలెన్‌స్కీతో మాట్లాడినట్లు, ఘర్షణ నివారణకు భారతదేశం తన లేకుండా కృషి చేస్తుందని ఇచ్చిన హామీకి కట్టుబడి ఉంటామని ప్రధాని తెలిపారు. ఉక్రెయిన్‌లో యుద్ధ పరిస్థితి జి 7 సదస్సులో ప్రధాన చర్చనీయాంశం అయింది. శత్రుత్వాన్ని కరుణతో శాంతింపచేయాలనే గౌతమ బుద్ధుడి బోధనలు ఆధునిక ప్రపంచం పాటిస్తే మంచిదని హితవు పలికారు.

ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితిని చక్కదిద్దేందుకు అన్ని శాంతికాముక శక్తులు యత్నించాల్సి ఉందన్నారు. ఇటువంటి సంక్లిష్టతలకు కేవలం సంప్రదింపులు, దౌత్యనీతి పరిష్కార మార్గం అనేదే ఆది నుంచి భారతదేశ అభిప్రాయం అన్నారు. ఇరుపక్షాల నడుమ సరైన దౌత్య ప్రక్రియలో సంప్రదింపులు జరిగి, సమస్య పరిష్కారం కావల్సి ఉందని, ఇందుకు తమ తరఫున అన్ని విధాలుగా పాటుపడుతామని మోడీ వివరించారు. భారత్‌లో కానీ జపాన్‌లో కానీ భగవాన్ బుద్ధను వేలాది ఏండ్లుగా అనుసరిస్తూ వస్తున్నారు. జటిల సమస్యల పరిష్కారానికి బుద్ధుని బోధనలను పాటిస్తే అది సంక్షుభిత మానవాళికి మంచి జరుగుతుందన్నారు. మూడు దేశాల పర్యటనకు వచ్చిన ప్రధాని ఆదివారం జపాన్ నుంచి పపూవా గియానాకు వెళ్లారు. అక్కడి నుంచి ఆస్ట్రేలియాకు వెళ్లుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News