హైదరాబాద్: పెంపుడు కుక్క దాడిలో డెలివరీ బాయ్ తీవ్రంగా గాయపడిన సంఘటన రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం చోటు చేసుకుంది. స్విగ్గీ ఆర్డర్‌ను డెలివరీ చేసేందుకు బాయ్ మణికొండ పంచవటి కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లాడు. ఇంటి డోర్ కొట్టగానే యజమానులు డోర్ తెరిచారు. వెంటనే ఇంటిలోని కుక్క దాడి చేసేందుకు యత్నించడంతో మూడో అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందకి దూకాడు. దీంతో స్విగ్గీ బాయ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాయ్‌ను ఇంటి యజమానులు ఆస్పత్రికి తరలించారు.
గతంలో యూసుఫ్‌గూడలోని శ్రీరాంనగర్‌కు చెందిన మహ్మద్ రిజ్వాన్(23) మూడేళ్లుగా స్విగ్గీలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. బంజారాహిల్స్‌లోని రోడ్డు నంబర్ 6లోని లుంబిని రాక్ క్యాసిల్ అపార్ట్‌మెంట్ మూడో అంతస్థులో ఆర్డర్ డెలివరీ చేసేందుకు వెళ్లాడు. ఇంట్లో ని జర్మన్ షపర్డ్ కుక్క మొరుగుతూ దాడి చేసేందుకు ప్రయత్నించడంతో రిజ్వాన్ మూడో అంతస్థు నుంచి కిందికి దూకాడు. దీంతో రిజ్వాన్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇంటి యజమాని శోభన వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స చేయించింది. ఇంటి యజమాని నిర్లక్షం వల్లే కుక్క దాడి చేసిందని రిజ్వాన్ సోదరుడు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.