Saturday, December 21, 2024

దుబాయ్ నంది అవార్డ్స్ ఇన్విటేషన్ బ్రోచ‌ర్‌ను విడుదల ఆలీ

- Advertisement -
- Advertisement -

రెండు తెలుగు రాష్ట్రాల ప్ర‌భుత్వ సహాయ స‌హ‌కారంతో ‘తెలంగాణ ఫిలిం ఛాంబర్స్‌ ఆఫ్‌ కామర్స్‌’ ఆధ్వ‌ర్యంలో 13 మంది జ్యూరీ సభ్యుల సమక్షంలో `టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ సౌత్ ఇండియా 2023` వేడుక‌లు ఆగస్టు 12 న దుబాయ్‌లోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు ఏర్పాట్లు చేస్తున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. తాజాగా ఈ నంది అవార్డ్స్ ఇన్విటేషన్ బ్రోచర్ ను హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో గ్రాండ్ గా విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వటైజర్, నటుడు ఆలీ, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ లు ముఖ్య అతిధులుగా పాల్గొని టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ ఇన్విటేషన్ బ్రోచర్ ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో రైటర్ మిట్టపల్లి సురేందర్, పల్లె లక్ష్మణ్ గౌడ్, ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి, హీరోయిన్ భవ్యశ్రీ, కోటేశ్వరరావు, రాదాకృష్ణ, బి. శ్రీనివాస్ గౌడ్,రాజ్, ప్రేమ్, శ్రీశైలం, వాహిద్, నిర్మాత సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో

టియ‌ఫ్ సీసీ చేర్మెన్ డా.ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ.. దాదాపు 6, 7 సంవత్సరాల తర్వాత రెండు ప్రభుత్వాలా సహకారంతో ఈ కార్యక్రమం చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చి కొంత స్పాన్సర్ కూడా చేస్తామని చెప్పారు.అలాగే ఆంధ్రప్రదేశ్ నుండి కూడా సహకారం లభిస్తుందని ఆశిస్తున్నాను. ఆగస్టు 12 న దుబాయ్ లో వరల్డ్ ట్రేడ్ సెంటర్ లో ఘ‌నంగా నిర్వ‌హించేందుకు 75 లక్షలు రెంట్ కట్టడం జరిగింది.ఈ నంది అవార్డ్స్ కు రెండు తెలుగు రాష్ట్రాల సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. అలాగే కేరళ సి.యం కూడా రావడం జరుగుతుంది. మరియు సౌత్ ఇండస్ట్రీ నుండి కూడా చాలా మంది హీరోలే కాకుండా బాలీవుడ్ నుండి కూడా పలువురు ప్రముఖులు రావడం జరుగుతుంది.తెలుగు కళాకారులను ప్రోత్సహించాలానే ఉద్దేశ్యంతో ఏమీ ఆశించకుండా స్వచ్ఛందంగా నేను చేస్తున్న కార్యక్రమం కొరకు నేను కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటున్నానని నిందలు మోపుతున్నారు.

నేను ఎవరిదగ్గరా డబ్బులు తీసుకోకుండా నేను నిజాయితీగా పనిచేస్తున్నాను. దుబాయ్ కు వెళ్లినాకూడా నేను సొంతంగా టికెట్ కొన్నాను. నేను ఎవరి దగ్గరైనా తీసుకున్నట్టు ప్రూవ్ చెయ్యండి. ఇదంతా నా సొంత ఖర్చులతో ఈ కార్యక్రమం చేస్తున్నాను. ఎవరికీ హనీ చేసే వ్యక్తిని కాదు. ఎవరికైనా డౌట్స్ ఉంటే ఓపెన్ గా అడగండి. నేను వారికీ సమాధానం చెపుతాను. ఇక ఈ అవార్డ్స్ కొరకు ప్రెజెంట్ సినిమాలనుండి ఎంట్రీస్ వస్తున్నాయి. డిసెంబర్ 2019 లోని సినిమాలు కూడా ఎంట్రీ అవ్వచ్చు.ఇవి జూన్ 15 th వరకు వచ్చిన ఎంట్రీ ని జ్యూ రీ కమిటీ నిర్ణయం ప్రకారమే సెలెక్షన్స్ జరుగుతాయి. అందరి నిర్మాతలను కలుపుకొని తెలంగాణ, ఆంధ్ర అని బేధాలు లేకుండా అందరూ కలసి పని చేస్తాము. ఈ నంది అవార్డ్స్ ప్రతి సంవత్సరం దుబాయ్ లోనే కంటిన్యూ చేస్తాము తప్ప ఆపే ప్రసక్తే లేదని అన్నారు.

నటుడు ఆలీ మాట్లాడుతూ.. 1964 నుండి నంది అవార్డ్స్ ఉన్నాయి.నంది అవార్డు అనేది ప్రతి ఆర్టిస్ట్ కల, అలాంటిది 7 సంవత్సరాలక్రితం ఆగిపోయిన నంది అవార్డ్స్ ను మళ్ళీ స్టార్ట్ చేస్తున్న ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి ధన్యవాదములు. అలాగే సీనియర్ నటుల పేరుతో కూడా స్మారక అవార్డ్స్ ఇవ్వడం అనేది హర్షించదగ్గ విషయం. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు సౌత్ ఇండియా నుండి కూడా సినీ, రాజకీయ ప్రముఖులు రావడం మరియు బాలీవుడ్ నుండి కుండా జితేందర్, జాకీ షరఫ్ తదితరులు రావడం గొప్ప విషయం.ఇలాంటి మంచి పని చేస్తున్న ప్రతాని రామకృష్ణ గౌడ్ గారికి నా అభినందనలు అన్నారు.

ప్రసన్న కుమార్ మాట్లాడుతూ. కళకు కులం, మతం, జాతి, ప్రాంతం వంటి బేధాభిప్రాయాలు లేవు . కళాకారులను ప్రోత్సహించేందుకు ఎదో పేరుతో అన్ని భాషల్లో అవార్డ్స్ జరుగుతున్నాయి. కానీ మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే జరగక పోవడం దురదృష్టకరం. నంది అవార్డు అనేది మన తెలుగు కళాకారులకు ప్రతిష్టాత్మకమైన అవార్డు.అయితే గ‌త కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డ్స్ ని మ‌ళ్లీ ప్ర‌తాని రామ‌కృష్ణ గారు రెండు ప్ర‌భుత్వాల స‌హ‌కారంతో చేయడం చాలా సంతోషం. తెలుగు కళాకారులను ప్రోత్సహించేందుకు ముందుకు వచ్చి మంచి పని చేస్తున్న తనపై నింద మోపడం సరైన పద్దది కాదు. మీకు చెయ్యడానికి ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు రండి మేము సహకరిస్తాము అంతే తప్ప మనం చేయం, చేసే వారిని చేయనివ్వం. కాబట్టి చేసే వారికి అడ్డు పడకుండా మన ఇండస్ట్రీ కోసం మంచి చేసే వారి మీద బురద జల్లకుండా మంచి చేసే రామకృష్ణ గౌడ్ గారి లాంటి వారికి సహాయ సహకారం అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

మిట్టపల్లి సురేందర్ మాట్లాడుతూ.. నంది అవార్డు అంటే ఆది ఒక ప్రిస్టేజ్. గతంలో నాకు నంది అవార్డు వచ్చింది. అవార్డ్స్ అనేవి ఎప్పుడూ మ‌న‌లో ఉత్సాహాన్ని నింపుతాయి ఇప్పుడు రామకృష్ణ గౌడ్ గారు ముందుకు వచ్చి చేస్తున్న ఈ నంది అవార్డు ఫంక్షన్ విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

హీరోయిన్ భవ్యశ్రీ మాట్లాడుతూ.. ఆగష్టు 12 న దుబాయ్ లో జరిగే టీఎఫ్‌సీసీ నంది అవార్డ్స్ ఇన్విటేషన్ బ్రోచర్ లాంచ్ కు పిలిచిన పెద్దలకు ధన్యవాదములు. రామకృష్ణ గౌడ్ గారు తలపెట్టిన ఈ నంది అవార్డ్స్ ప్రోగ్రాం సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

టీఎఫ్‌సీసీ వైస్ చేర్మెన్ లయన్స్ క్లబ్ గవర్నర్ కోటేశ్వరరావు మాట్లాడుతూ.. గ‌త కొన్నేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డ్స్ ని ఇవ్వాలనే చాలా మంచి ఆలోచనతో చేస్తున్న రామకృష్ణ గారికి మా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని అన్నారు

ఆర్టిస్ట్ జ్యోతి రెడ్డి మాట్లాడుతూ.. చాలా రోజుల తరువాత ఇలాంటి మంచి వేడుక చేయడం చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు రామకృష్ణ గౌడ్ గారు ముందుకు వచ్చి చేస్తున్న ఈ నంది అవార్డు ఫంక్షన్ ను సక్సెస్ చేస్తాడనే నమ్మకం ఉందని అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News