Sunday, December 22, 2024

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగోను ఆవిష్కరించిన సిఎం కెసిఆర్

- Advertisement -
- Advertisement -

తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానం,
తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించేలా
లోగోను రూపొందించిన ప్రభుత్వం

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించిన నేపథ్యంలో రాష్ట్ర సాధన నుంచి నేటిదాకా పదేండ్లకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రగతి ప్రస్థానాన్ని, తెలంగాణ అస్తిత్వాన్ని ప్రతిబింబించే విధంగా ప్రభుత్వం రూపొందించిన లోగోను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సెక్రటేరియట్ లోని తన ఛాంబర్ లో సోమవారం ఆవిష్కరించారు. దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ మోడల్‌గా దేశ ప్రజలు ఆదరిస్తున్న రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన కాళేశ్వరం వంటి సాగునీటి ప్రాజెక్టులు, విద్యుత్తు, వ్యవసాయం, మిషన్ భగీరథ, సాంసృతిక, యాదాద్రి వంటి ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రాలు, మెట్రో రైలు, టీ-హబ్, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ సచివాలయం, 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం చిహ్నాలను ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు లోగోలో పొందుపరిచారు.

వీటితోపాటు తెలంగాణ తల్లి, బతుకమ్మ, బోనాలు, పాలపిట్ట, అమరవీరుల స్మారకంతో కూడిన తెలంగాణ అస్తిత్వ చిహ్నాలతో తెలంగాణ ఖ్యాతి మరింత ఇనుమడించేలా తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల లోగో రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, దేశపతి శ్రీనివాస్, పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యేలు ఆశన్నగారి జీవన్ రెడ్డి, బాల్క సుమన్, సీఎం ప్రధాన సలహాదారు సోమేశ్ కుమార్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ శాంతి కుమారి, ఆర్ధికశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News