Tuesday, December 24, 2024

హజ్ యాత్రికుల కోసం ఎయిర్ ఇండియా ప్రత్యేక విమాన సర్వీస్‌లు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలోని జెడ్డా, మదీనాలకు వెళ్లే హజ్ యాత్రికుల కోసం ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు ప్రత్యేక విమాన సర్వీస్‌లు నడపడానికి సిద్ధమయ్యాయి. జైపూర్, చెన్నై, కొజికోడ్, కన్నూర్, నుంచి ప్రత్యేక విమానాలు దాదాపు 19.000 మంది హజ్ యాత్రికులను తీసుకెళ్తాయి. ఎయిర్ ఇండియా జైపూర్, చెన్నై నుంచి మదీనా, జెడ్డాలకు మొదటి దశలో46 సర్వీస్‌లను నడుపుతుంది.

ఈ నెల 21న జైపూర్ నుంచి మొదటి సర్వీస్ ప్రారంభమైందని, జూన్ 21 వరకు నడుస్తుందని సోమవారం ప్రకటించారు. రెండో దశలో జులై 3 నుంచి ఆగస్టు 2 వరకు ఎయిర్ ఇండియా 43 సర్వీస్‌లు జైపూర్, చెన్నైలకు యాత్రికులను తిరిగి తీసుకువస్తాయి. జైపూర్ నుంచి ఎయిర్ ఇండియా 27 విమానాల్లో 5871 మంది, చెన్నై నుంచి 19 విమానసర్వీస్‌ల ద్వారా 4447 యాత్రికులు బయలుదేరుతారు.

జూన్ 4 నుంచి 22 వరకుకొజికోడ్, కన్నూర్ నుంచి ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు బయలుదేరుతాయి. 44 విమానాలు కొజికోడ్ నుంచి జెడ్డాకు 6363 మంది యాత్రికులను, 13 విమానాలు కన్నూర్ నుంచి జెడ్డాకు 1873 మందిని తీసుకెళ్తాయి. రెండోదశలో జులై 13 నుంచి ఆగస్టు 12 వరకు ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానసర్వీస్‌లు మదీనా నుంచి కొజికోడ్, కన్నూర్‌లకు యాత్రికులను తిరిగి తీసుకువస్తాయి. భారత్‌కు తిరిగి వచ్చే విమానాల ద్వారా జామ్‌జామ్ పవిత్ర జలాలను తీసుకు వస్తామని, యాత్రికులు స్వదేశానికి చేరుకోగానే వారికి అందిస్తామని ఎయిర్ ఇండియా సిఇఒ , ఎండి క్యాంప్‌బెల్ విల్సన్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News