Monday, December 23, 2024

ఘాజీయాబాద్‌లో వడగాలులకు 1100 మంది అనారోగ్యం

- Advertisement -
- Advertisement -
ఆసుపత్రిపాలైన 114 మంది

ఘాజీయాబాద్: ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజీయాబాద్‌లో సోమవారం వడగాలులకు దాదాపు 1100 మంది అనారోగ్యం పాలయ్యారు. 114 మంది ఆసుపత్రిపాలయ్యారు. ప్రయివేట్ ఆసుపత్రులలోనూ వడదెబ్బకు చాలా మంది చేరారని సమాచారం. ఘాజీయాబాద్‌లో ఉష్ణోగ్రత 43 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుంది.

వడదెబ్బ అనేది తీవ్ర ఎండకు కలుగుతుంది. అదో మెడికల్ ఎమర్జెన్సీ స్థితి అని ఎంఎంజి ఆసుపత్రికి చెందిన డాక్టర్ అలోక్ రంజన్ తెలిపారు. వడదెబ్బ తగిలి ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య క్రమంగా పె రుగుతున్నట్లు ఆయన తెలిపారు. ‘శరీరం ఎప్పుడైతే ఓవర్ హీట్ అవుతుందో, చల్లబడదో అప్పుడు వడదెబ్బ తగులుతుంది. దానివల్ల అనేక దుష్పరిణామాలు చోటుచేసుకుంటాయి. ఇలాంటి కేసుల్లో వెంటనే చికిత్స అవసరం’ అని డాక్టర్ అలోక్ రంజన్ తెలిపారు. ఎండ బాగా ఉన్నప్పుడు బయటకు వెళ్లొద్దని ఘాజీయాబాద్ జిల్లా మెజిస్ట్రేట్ ఆర్‌కె. సింగ్ హెచ్చరించారు. ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు బయటకు వెళ్లొద్దని అన్నారు. ఎండ వేడిమిని తట్టుకోడానికి ఓఆర్‌ఎస్ వాడాలని, పండ్ల రసాలు, కొబ్బరి నీళ్లు తాగాలని డాక్టర్లు సిఫార్సు చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News