Monday, December 23, 2024

మహిళ రక్షణ కోసమే సిడిఈడబ్ల్యూ కేంద్రాలు

- Advertisement -
- Advertisement -

మూడు కమిషనరేట్లలో 26 కేంద్రాలు ఏర్పాటు
భవిష్యత్‌లో సబ్ డివిజన్లలో ఏర్పాటు చేస్తాం
రాచకొండలో ప్రారంభించిన మహిళా భద్రతా విభాగం ఎడిజి శిఖాగోయెల్

హైదరాబాద్: మహిళ రక్షణ కోసమే సిడిఈడబ్లూ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మహిళా భద్రతా విభాగం ఎడిజి శిఖాగోయెల్ అన్నారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన సిడిఈడబ్లూ కేంద్రాలను మంగళవారం ఎడిజి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడు పోలీస్ కమిషనరేట్ల పరిధిలో 26 కేంద్రాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. రానున్న రోజుల్లో సబ్ డివిజన్లలో ఏర్పాటు చేస్తామని తెలిపారు. రాచకొండలో 5లు ప్రారంభించామని వీటితో ఇప్పటి వరకు 15 ప్రారంభమయ్యాయని తెలిపారు. వచ్చే నెల వరకు 26 కేంద్రాలు పనిచేయనున్నాయని తెలిపారు.

ఇప్పటి వరకు మహిళలు, స్థానిక పోలీస్ స్టేషన్లలో లేదా భరోసా కేంద్రాల్లో కౌన్సెలింగ్ జరిగేదని, పోలీసింగ్‌ను ప్రజల ఇంటి వద్దకు తీసుకురావడానికి కేంద్రాలను స్థానికంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఇక నుంచి బాధితులు స్థానిక పోలీస్ స్టేషన్, భరోసా సెంటర్లకు వెళ్లనవసరం లేదని, సిడిఈడబ్లూ కేంద్రాలకు రావచ్చని అన్నారు. భాగస్వాముల వద్ద ఎదురయ్యే హింసను మహిళలు బయటికి చెప్పడంలేదని అన్నారు. కేంద్రాల ద్వారా కుటుంబాలను ఒకచోట చేర్చడానికి ప్రయత్నం చేస్తామని తెలిపారు.

రాచకొండ పోలీస్ కమిషనర్ డిఎస్ చౌహాన్ మాట్లాడుతూ కమిషనరేట్‌లో ఏకకాలంలో 5 కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. త్వరలో మరో రెండు కేంద్రాలను ప్రారంభిస్తామని తెలిపారు. బహిరంగా, ఆన్‌లైన్ స్టాకింగ్‌పై అవగాహన కార్యక్రమాలు, షార్ట్ ఫిల్మ్‌ను రూపొందిస్తున్నట్లు తెలిపారు. సిడిఈడబ్లూ కేంద్రాలు, షీటీమ్స్ బృందాలు, మహిళల భద్రత, ఆన్‌లైన్ వేధింపులపై అవగాహన కల్పించేందుకు ఆడియో, వీడియో వ్యాన్ ఉపయోగించబడుతుందని అన్నారు. కార్యక్రమంలో డిసిపి శ్రీబాల, ఎసిపి శ్రీధర్‌రెడ్డి, ఎసిపి వెంకట్‌రెడ్డి, ఇన్స్‌స్పెక్టర్లు అంజిరెడ్డి, మంజుల, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News