Monday, December 23, 2024

సిఎం చిత్రపటానికి పాలాభిషేకం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : జూనియర్ పంచాయతీ కార్యదర్శుల (జెపిఎస్) సర్వీసు క్రమబద్ధీకరణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇందుకు విధివిధానాలను ఖరారు చేయాలని ముఖ్యమంత్రి కెసిఆర్ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం పట్ల రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శులు మంగళవారం సంబరాలు నిర్వహించారు.

ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఆసిఫాబాద్ జిల్లా కౌటాల ఎంపిడివో కార్యాలయంలో, ఇచ్చోడ మండల కార్యాలయంలో, ఏటూరు నాగారం ఎంపిడివో కార్యాలయ ఆవరణలో సిఎం కెసిఆర్ చిత్రపటానికి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు పాలాభిషేకం చేశారు. పలు జిల్లాలోని మండల కేంద్రాల్లో ప్రజాప్రతినిధుల సమక్షంలో ముఖ్యమంత్రి చిత్ర పటానికి పాలాభిషేకం చేసి జూనియర్ పంచాయతీ కార్యదర్శులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News