- Advertisement -
హైదరాబాద్: పారాఅథ్లెట్ కె.లోకేశ్వరికి గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ రాజ్‌భవన్‌లో మంగళవారం రూ.50,000ల చెక్కును అందచేశారు. లోకేశ్వరి ఆమె ఎంచుకున్న క్రీడలో రాణించడానికి వృత్తిపరమైన శిక్షణ అందించడానికి ఉపయోగపడుతుందని గవర్నర్ తెలిపారు.
షాట్‌పుట్, డిస్కస్ త్రోలో పారా అథ్లెట్ లోకేశ్వరి శిక్షణ తీసుకుంటోంది. ప్రస్తుతం ఆమె అంతర్జాతీయ పోటీల్లో మన దేశం నుంచి ప్రాతినిథ్యం వహిస్తారు. ఈ నేపథ్యంలోనే లోకేశ్వరికి గవర్నర్ చెక్కును అందజేశారు.
- Advertisement -