Friday, December 20, 2024

అత్యంత సన్నని మోటరోలా ఎడ్జ్ 40 స్మార్ట్‌ఫోన్

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన మోటరోలా ఎడ్జ్ 40 5జి స్మార్ట్‌ఫోన్‌ను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఐపి68 అండర్ వాటర్ ప్రొటెక్షన్‌తో ప్రపంచంలోనే అత్యంత సన్నని 5జి స్మార్ట్‌ఫోన్ అని కంపెనీ పేర్కొంది. 8జిబి ర్యామ్, 256జిబి స్టోరేజ్‌తో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.29,999 గా కంపెనీ నిర్ణయించింది.

మే 23 నుంచి ఈ స్మార్ట్‌ఫోన్ కంపెనీ అధికారిక వెబ్‌సైట్, ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-ఆర్డర్లను ప్రారంభించింది. మే 30 నుంచి అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది. మోటరోలా ఎడ్జ్ 40 సెగ్మెంట్-మొదటి 144 హెడ్జ్ 3డి కర్వ్‌డ్ 6.55 -అంగుళాల ఎఫ్‌హెచ్‌డి+ పోలెడ్ డిస్‌ప్లే, 360హెడ్జ్ టచ్ శాంప్లింగ్ రేట్, హెచ్‌డిఆర్10+ సపోర్ట్‌తో వస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News