Saturday, November 23, 2024

గెలిచి నిలిచేదెవరో?

- Advertisement -
- Advertisement -

లక్నోతో ముంబై అమీతుమీ, నేడు ఎలిమినేటర్ సమరం,  రాత్రి 7.30 గం. నుంచి

చెన్నై : ఐపిఎల్ సీజన్16లో భాగంగా బుధవారం జరిగే ఎలిమినేటర్ సమరంలో మాజీ ఛాంపియన్స్ ముంబై ఇండియన్స్‌తో లక్నో సూపర్‌జెయింట్స్ అమీతుమీ తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు క్వాలిఫయర్2కు అర్హత సాధిస్తోంది. ఓడిన టీమ్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమిస్తోంది. లీగ్ దశలో రెండు జట్లు కూడా అద్భుత ఆటను కనబరిచాయి. లక్నో ఆరంభం నుంచే నిలకడైన ప్రదర్శన చేయగా ముంబై మధ్యలో పుంజుకుంది. ఆరంభంలో వరుస ఓటములు చవిచూసిన ముంబై ఆ తర్వాత అద్భుత ప్రదర్శనతో అలరించింది. లక్నో కూడా నిలకడైన ఆటతో లీగ్ దశలో మూడో స్థానాన్ని సొంతం చేసుకుం ది. చెన్నైతో సమానంగా 17 పాయింట్లు సాధించినా రన్‌రేట్‌లో వెనుకబడడంతో మూడోస్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. దీంతో ఎలిమినేటర్ సమరం ఆసక్తికరంగా సాగడం ఖాయం.

జోరుమీదున్న ముంబై..
ఒక దశలో టాప్6లో చోటు సంపాదించడమే కష్టమని భావించిన ముంబై ఇండియన్స్ ఏకంగా ప్లేఆఫ్‌కు అర్హత సాధించి పెను ప్రకంపనలు సృష్టించింది. కీలక సమయంలో అనూహ్యంగా పుంజుకున్న ముంబై నాకౌట్‌కు దూసుకొచ్చింది. ముంబై 200కి పైగా భారీ లక్ష్యాలను అలవోకగా ఛేదిస్తూ ప్రత్యర్థి జట్లను హడలెత్తిస్తోంది. హైదరాబాద్‌తో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై భారీ లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించి ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మలు జట్టుకు శుభారంభం అందిస్తున్నారు.

కెప్టెన్ రోహిత్ ఫామ్‌లోకి రావడం ముంబైకి కలిసి వచ్చే అంశంగా చెప్పాలి. కిందటి మ్యాచ్‌లో కామెరూన్ గ్రీన్ అజేయ శతకంతో కదం తొక్కాడు. ఈసారి కూడా అతనిపై జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. సూర్యకుమార్ యాదవ్ కూడా జోరుమీదున్నాడు. ఒంటిచేత్తో మ్యాచ్ ఫలితాన్ని తారుమారు చేసే గ్రీన్, సూర్యకుమార్‌లు మరోసారి చెలరేగితే లక్నో బౌలర్లకు కష్టాలు ఖాయం. అంతేగాక టిమ్ డేవిడ్, నెహాల్ వధెరా, క్రిస్ జోర్డాన్ వంటి స్టార్ బ్యాటర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. బౌలింగ్‌లో కూడా ముంబై బాగానే కనిపిస్తోంది. దీంతో ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన ఫేవరెట్‌గా బరిలోకి దిగుతోంది.

సంచలనాలకు మరో పేరు..
ఇక ఈ సీజన్‌లో లక్నో అంచనాలకు మించి రాణించిందనే చెప్పాలి. గాయంతో కెప్టెన్ కెఎల్ రాహుల్ అర్ధాంతరంగా జట్టుకు దూరమైనా దాని ప్రభావం కనిపించలేదు. కృనాల్ పాండ్య అద్భుత కెప్టెన్సీతో జట్టును ముందుండి నడిపించాడు. కీలకమైన మ్యాచుల్లో లక్నో అద్భుతంగా రాణించింది. లీగ్ దశలో బెంగళూరు, ఢిల్లీ, సన్‌రైజర్స్, రాజస్థాన్, ముంబై, పంజాబ్, కోల్‌కతా వంటి బలమైన జట్లను లక్నో ఓడించింది.

డికాక్, ప్రేరక్ మన్కడ్, కృనాల్ పాండ్య, స్టోయినిస్, అయూష్ బడోని, నికోలస్ పూరన్, కృష్ణప్ప గౌతమ్ వంటి బ్యాటర్లు జట్టుకు అందుబాటులో ఉన్నారు. స్టోయినిస్, బడోని, పూరన్‌లు ఈ సీజన్‌ల అత్యంత నిలకడైన ఆటను కనబరుస్తున్నారు. ముంబైపై కూడా చెలరేగాలనే పట్టుదలతో ఉన్నారు. అంతేగాక కృనాల్ పాండ్య, రవి బిష్ణోయ్, నవీనుల్ హక్, గౌతమ్ తదితరులతో బౌలింగ్ కూడా బాగానే ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో లక్నోకు కూడా గెలుపు అవకాశాలు సమంగానే కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News