Monday, December 23, 2024

హైదరాబాద్‌కు స్టేట్ స్ట్రీట్

- Advertisement -
- Advertisement -

5 వేల మందికి ఉపాధి కల్పించనున్న అతిపెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ, బోస్టన్‌లో సమావేశం అనంతరం ట్విట్టర్‌లో ప్రకటించిన ఐటి మంత్రి కెటిఆర్, డెలివరీ సెంటర్ విస్తరణను ప్రకటించిన గ్రిడ్ డైనామిక్స్ సంస్థ

మన తెలంగాణ/హై-దరాబాద్ : ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు ఇన్వెస్ట్‌మెంట్ సర్వీసింగ్, ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్, ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ అండ్ ట్రేడింగ్ సేవలను అందించడంలో ప్రపంచంలోనే అగ్రగామి స్పెషలిస్ట్ అయిన స్టేట్ స్ట్రీట్ కార్పొరేష న్ మంగళవారం హైదరాబాద్‌లో తన విస్తరణను ప్రకటించింది. 5 వేల కొత్త ఉద్యోగాలను కల్పిం చనున్నది. బోస్టన్‌లో కంపెనీ బృందంతో సమావేశమైన అనంతరం రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటిఆర్ ఈ విషయాన్ని ప్రకటించారు. ‘హైదరాబాద్ బిఎఫ్‌ఎస్‌ఐ(బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇన్సూరెన్స్) రంగానికి బోస్టన్ నుండి అతిపెద్ద శుభవార్త. 40ట్రిలియన్ల డాలర్ల కుపైగా సంపద కలిగిన స్టేట్ స్ట్రీట్ హైద రాబాద్‌లో భారీ విస్తరణ చేపట్టనున్నది. ఇది ప్ర పంచంలోని అతి పెద్ద అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీలలో ఒకటి. 5వేల కొత్త ఉద్యోగాలను జోడించ డం ద్వారా హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున విస్తరిస్తోంది. బోస్టన్ ప్రధాన కార్యాలయం తర్వాత హైదరాబాద్‌లోనే అతి పెద్ద కార్యాల యాన్ని ప్రా రంభించనున్నది. చాలా గర్వంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు.

విస్తరణను ప్రకటించిన గ్రిడ్ డైనమిక్స్
హైదరాబాద్‌లో డెలివరీ సెంటర్ విస్తరణను గ్రిడ్ డైనమిక్స్ సంస్థ ప్రకటించింది. హైదరాబాద్‌లో డాటా సెంటర్ అభివృద్ధికి 50 మిలియన్ డాలర్లను ఔరమ్ ఈక్విటీ  పార్ట్‌నర్స్ సంస్థ కేటాయించింది. తెలంగాణ ఐటి ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్‌తో పలు సంస్థల ప్రతినిధులు సమావేశమయ్యారు. తెలంగాణలో డాటా టెక్ స్టార్టప్ కోసం ఔరమ్ వెంచర్ పార్ట్‌నర్స్ సంస్థ ఐదు మిలియన్ డాలర్లు ప్రకటించింది. అటు రాష్ట్ర ప్రభుత్వంతో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఒప్పందం కుదుర్చుకొంది. తక్కువ ధరలో పర్యావరణహిత వాహనాలను అందించే రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళికల కోసం ఒప్పందం జరిగింది. ఒప్పందంలో భాగంగా జీరో ఎమిషన్ వాహనాల కోసం సమగ్ర ప్రణాళిక రూపకల్పన చేయనున్నారు.

పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ
పెట్టుబడులకు కేరాఫ్ అడ్రస్‌గా తెలంగాణ అనేటట్లుగా మంత్రి కెటిఆర్ మార్చేశారు. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో పలు అంతర్జాతీయ సంస్థలతో పెట్టుబడి ఒప్పందాలు చేసుకున్నారు. ట్రావెల్ రంగంలో దిగ్గజ సంస్థ అయిన మాండీ తెలంగాణలో టెక్నాలజీ సెంట ర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు ఈ సంస్థ తెలిపింది.

ఆటోమొబైల్ రంగానికి సంబంధించి గేర్లు ఉత్పత్తి చేసే రేవ్ గేర్స్ సంస్థ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణలో ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సుముఖత చూపింది. మొట్టమొదటి గ్లోబల్ డెవలప్‌మెంట్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన స్టోరెబుల్ సంస్థ హైదరాబాద్‌లో తమ సేవలను విస్తరించేందుకు ముందుకు వచ్చిం ది. హైదరాబాద్ నుంచి వంద మంది సాఫ్ట్‌వేర్ డెవలపర్లను హైర్ చేసుకుని తమ సేవలను విస్తరించనుంది. అలాగే డిజిటల్ సొల్యూషన్స్ రంగంలో ప్రముఖమైనది రైట్ సాఫ్ట్‌వేర్ సంస్థ. ఇది తెలంగాణలోని ప్రముఖ విద్యా సంస్థలతో కలి సి తమ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. జూన్ 30న ఏర్పాటు చేయనున్న సంస్థ కేంద్రాన్ని మంత్రి కెటిఆర్ ప్రారంభించనున్నారు. 500 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నాయి.

హైదరాబాద్‌లోని క్లోవర్టెక్స్
గ్లోబల్ కెపాబిలిటీస్‌సెంటర్‌ను విస్తరణ
లైఫ్ సైన్సెస్ పరిశ్రమ కోసం సైంటిఫిక్ క్లౌడ్ కంప్యూటింగ్‌లో స్పెషలిస్ట్ అయిన క్లోవర్టెక్స్ తన గ్లోబల్ కస్టమర్‌లకు మాత్రమే కాకుండా పాన్-ఇండియాలోని కస్టమర్‌లకు కూడా మద్దతు ఇవ్వడానికి హైదరాబాద్‌లోని తన గ్లోబల్ కెపాబిలిటీస్ సెంటర్ (జిసిసి)ని విస్తరించనున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కెటిర్, క్లోవర్‌టెక్స్ వ్యవస్థాపకు డు, ముఖ్య కార్యనిర్వహణాధికారి క్షితిజ్ కుమార్ నేతృత్వంలోని క్లోవర్‌టెక్స్ మేనేజ్‌మెంట్ బృందంతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ మాట్లాడుతూ, క్లోవర్టెక్స్ తన ఇండియా సెంటర్‌ను హైదరాబాద్‌లో స్థాపించాలని నిర్ణయించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

యుఎస్‌ఎలోని బోస్టన్‌లోని క్లోవర్టెక్స్ ప్రధా న కార్యాలయం వెలుపల ఇది ఆ కంపెనీ మొదటి కేం ద్రమని, సుమారు 100 కోట్ల పెట్టుబడులు పెట్టనున్న ట్లు వెల్లడించారు. దీని ద్వారా 100 నుంచి 150 మం దికి ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు. క్లోవర్టెక్స్ తమ హైదరాబాద్ కేంద్రం నుండి అధునాతన బయో ఇన్ఫర్మేటిక్స్, బిగ్ డేటా అనలిటిక్స్ పని చేయాలని ల క్ష్యంగా పెట్టుకుందని తెలిపారు. ఈ సమావేశంలో ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, డైరెక్టర్ లైఫ్ సైన్సెస్ శక్తి ఎం నాగప్పన్, సమ్మిట్ కన్సల్టింగ్ సర్వీసెస్ వ్యవస్థాపకులు, సిఇఒ సందీప్ శర్మ పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News