Saturday, November 23, 2024

ఆ మామిడిపండు ధర వింటే షాక్ అవుతారు..

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: ఫలరాజుగా మామిడి పండును అభివర్ణిస్తారు. అయితే..మన దేశంలో వేసవికాలంలో మా మిడి పండ్ల ధర మొదట్లో ఖరీదు ఎక్కువ ఉన్నా వర్షాకాలం వచ్చేనాటికి పూర్తిగా దాని ధరి తగ్గిపోతుంది. కాని..ప్రూపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండు ఏమిటో మీకు తెలుసా? అక్షరాలా కిలో రూ.2.5 లక్షలు. అయితే ఇది మన దేశంలో చెట్లకు కాసే మామిడి పండు కాదు. జపాన్‌లో కాసే ఈ మామిడి పండును ప్రస్తుతం కర్నాటకలోని కొప్పల్‌లో జరుగుతున్న మామిడి పండ్ల మేళాలో ప్రదర్శనకు ఉంచారు. మియాజాకి పేరుతో పిలిచే ఈ మామిడి రకం ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి సందర్శకులను సంభ్రమాశ్చర్యాలలో ముంచెత్తుతోంది.

మంగళవారం కొప్పల్‌లో మామిడి పండ్ల ప్రదర్శన-అమ్మకం మేళా ప్రారంభమైంది. ఇందులో మియాజాకి రకం మామిడి పండును ఒక్కటంటే ఒక్కటి ప్రదర్శనకు ఉంచారు. కాషాయం రంగులో ఉన్న ఈ మామిడిపండు రంగేకాదు వాసన కూడా సందర్శకులను మైమరపిస్తోంది. ప్రదర్శన కోసం ఒక్క పండును రూ. 40,000 ఇచ్చి మరీ కొనుగోలు చేసినట్లు మేళా నిర్వహిస్తున్న కర్నాటక ప్రభుత్వ హార్టికల్చర్ శాఖ అధికారులు తెలిపారు. దీని మొక్కను కూడా ప్రదర్శనకు ఉంచారు. రైతులు, ఇతర పండ్లతోటల పెంపెకందారులు కూడా దీన్ని కొనుగోలు చేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. అయితే దీని ఖరీదు రూ. 15,000 కావడంతో వారు కొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News