Saturday, November 23, 2024

భారతీయ విద్యార్థులపై ఆస్ట్రేలియన్ వర్సిటీల నిషేధం

- Advertisement -
- Advertisement -

మెల్బార్న్: వీసా దరఖాస్తుల మోసాలకుకు సంబంధించి తాజా కేసులు వెలుగులోకి రావడంతో భారతదేశానికి చెందిన కొన్ని రాష్ట్రాల నుంచి వచ్చే విద్యార్థుల నియామకంపై ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలు నిషేధం విధించాయి.
పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్‌తోపాటు కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీరు నుంచి వచ్చే విద్యార్థులను ఇక నియమించవద్దని ఆదేశిస్తూ విద్యా ఏజెంట్లను విక్టోరియాలోని ది ఫెడరేషన్ యూనివర్సిటీ, న్యూ సౌత్ వేల్స్‌లోని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీ గత వారం లేఖలు రాసినట్లు ది సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ పత్రిక తెలిపింది.
ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోడీ ఉభయ దేశాలకు చెందిన విద్యార్థుల మధ్య బంధం మరింత బలపడాలని పిలుపునిచ్చిన తరుణంలోనే ఈ పరిణామం తలెత్తడం గమనార్హం. విద్యార్థులు, పరిశోధకులు, వ్యాపారుల మధ్య మార్పిడిని ప్రోత్సహించేందుకు ఉభయ దేశాల మధ్య మైగ్రేషన్, మొబిలిటీ భాగస్వామ్య ఒప్పందంపై కూడా మోడీ పర్యటన సందర్భంగా సంతకాలు జరిగాయి.

గత నెలలోనే విక్టోరియా యూనివర్సిటీ, ఎడిత్ గోవన్ యూనివర్సిటీ, టోరెన్స్ యూనివర్సిటీ, సదరన్ క్రాస్ యూనివర్సిటీతోసహా అనేక ఆస్ట్రేలియన్ యూనివర్సిటీలు భారత్‌లోని కొన్ని రాష్ట్రాల విద్యార్థులపై నిషేధం విధించాయి. ఉన్నత చదువుల పేరు చెప్పి భారతీయ విద్యార్థులు ఉద్యోగం చేయడం కోసం ఆస్ట్రేలియన్ యూనివర్సిటీల వీసా కోసం దరఖాస్తు చేస్తున్నారని, ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న కొన్ని వీరి నియామకాన్ని నిషేధించాలని ఆయా యూనివర్సిటీలు ఆదేశాలు జారీచేశాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News